Newsడ్రగ్స్ కంటే అది చాలా ప్రమాదం.. కొరటాల ట్వీట్ సంచలనం..!

డ్రగ్స్ కంటే అది చాలా ప్రమాదం.. కొరటాల ట్వీట్ సంచలనం..!

టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ సృష్టిస్తున్న సంచలనాలు తెలిసిందే. నోటీసుకులు పంపించిన వారిని రోజుకొకరు చొప్పున సిట్ అధికారులు విచారణ చేస్తుండగా ఈ క్రమంలో మీడియా చేసే హంగామా మాములుగా లేదు. అయితే ఈ డ్రగ్స్ కుంభకోణంలో టార్గెట్ టాలీవుడ్ అవ్వడం సిని ప్రముఖుల నుండి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ విషయం గురించి స్పందించిన దర్శకుడు కొరటాల శివ డ్రగ్స్ కన్నా అవినీతి చాలా ప్రమాదకరమని. ముందు అన్ని ప్రభుత్వాలు దాన్ని నిర్మూలించడానికి ముందుకు రావాలని అన్నారు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే దర్శకుడు కొరటాల శివ. డ్రగ్స్ అనేది కేవలం ఒక మనిషి వ్యాసనానికి సంబందించినదని.. అదే అవినీతి దేశాన్ని నాశనం చేస్తుందని అన్నట్టుగా తన మాటల్లో అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోశియేషన్ ‘సే నో టూ డ్రగ్స్’ అంటూ ఓ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుతం మొదటి లిస్ట్ లోని టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులు త్వరలోనే రెండో లిస్ట్ కూడా బయటపెట్టబోతున్నారట. ఇక ఈ సెకండ్ లిస్ట్ లో మరికొంతమంది నటులు, నిర్మాతల తనయులు నోటీసులు అందుకోనున్నారని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news