Movies"శ్రీజను అలాంటి సలహా అడిగిన నెటిజన్".. అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చిన మెగా...

“శ్రీజను అలాంటి సలహా అడిగిన నెటిజన్”.. అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చిన మెగా డాటర్.. దెబ్బకి అందరి నోర్లు ఖతక్..!

శ్రీజ ..హీరోయిన్ కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో హీరోయిన్ కి మించిన రేంజ్ లో ట్రోలింగ్కి గురైంది . మరీ ముఖ్యంగా మెగా డాటర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకొని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకొని రెండుసార్లు విడాకులు తీసుకోవడం హాట్ హాట్ గా ట్రెండ్ అయింది. మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ రెండవసారి పెద్దలు చెప్పిన వివాహాన్ని చేసుకుంది . ఆమె దురదృష్టమో లేకపోతే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వల్ల విడిపోయారో తెలియదు కానీ.. రెండు కూడా పెటాకులు అయిపోయాయి .

మొదటిసారి ఆమె డివర్స్ తీసుకోగ రెండవసారి కళ్యాణ్ దేవ్ ఆమె నుంచి డివోర్స్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి . కాగా ఆ తర్వాత సోషల్ మీడియాలో శ్రీజ పేరుపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనకు తెలిసిందే . తాజాగా సోషల్ మీడియాలో శ్రీజను ఒక అమ్మాయి సలహా అడిగింది. ఆ సలహా కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

“నాకు విడాకులు తీసుకోవాలని ఉంది ..నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే నాతోనే ఉండు అంటున్నాడు నా భర్త .. నేను ఏం చేయాలి? మీరు సలహా ఇవ్వండి ప్లీజ్..” అంటూ కామెంట్ పెట్టింది. దీనికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది మెగా డాటర్ శ్రీజ . ఇది వేరే వాళ్ళు ఆన్సర్ ఇచ్చే ప్రశ్న కాదు.. నీకు నువ్వే ప్రశ్నించుకో ..నువ్వు నిజంగానే అతనితో ఆనందంగా ఉంటాను అంటే అతనితోనే ఉండు ..ఒకవేళ ఉన్నా కూడా నేను అలా ఉండలేను అనిపిస్తే విడాకులు తీసుకో. అది నీ ఇష్టం పూర్తిగా నీ ఇష్టప్రకారమే నువ్వు ముందుకెళ్లు ” అంటూ సలహా ఇచ్చింది . దీంతో మెగా డాటర్ శ్రీజ మెచ్యూరిటీ లెవెల్స్ కి ఫిదా అయిపోతున్నారు జనాలు . అంతేకాదు శ్రీజ ఇక మూడో పెళ్లి చేసుకోదు అని ఆమెకి లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news