Moviesకే జి ఎఫ్ - సలార్ - డ్రాగన్.. ప్రశాంత్ నీల్...

కే జి ఎఫ్ – సలార్ – డ్రాగన్.. ప్రశాంత్ నీల్ టైటిల్స్ వెనక ఇంత పెద్ద అర్థం ఉందా..?

పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు . ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు తనకంటూ సూపర్ ఫాం ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు . చేసింది తక్కువ సినిమాలే ..కాని ప్రతి సినిమా హిట్ కొట్టడంతో జూనియర్ రాజమౌళి అంటూ ట్యాగ్ చేయించుకున్నారు . మరి కొద్ది రోజుల్లోనే రాజమౌళి ని మించిపోయే స్థాయికి ఎదిగిపోతాడు ప్రశాంత్ నీల్ ప్రచారం కూడా జరుగుతుంది.

కాగా మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది. ఈ క్రమంలోని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన టైటిల్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు మేకర్స్ . అయితే ఈ సినిమాకి డ్రాగన్ అంటూ ఓ పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకొచ్చారు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్స్ అన్నీ కూడా వెరైటీగా ఉంటాయి . మనం వాడుక భాషలో మాట్లాడే ఏ పదాన్ని కూడా ఆయన తన సినిమా టైటిల్స్ లో పెట్టుకోరు .

గతంలో తెరకెక్కించిన ఉగ్రం..కే జి ఎఫ్ ఆ తర్వాత వచ్చిన సలార్ ఇప్పుడు తెరకెక్కించబోతున్న డ్రాగన్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి. అయితే ప్రశాంత్ నీల్ టైటిల్స్ ని కధకు అనుకూలంగా ఫిక్స్ చేసుకుంటారట . మిగతా వాళ్ళలాగా ఏది పడితే ఆ టైటిల్ పెట్టి సినిమాకి రిలేటెడ్ గా ఉండే కంటెంట్ పరంగానే ఆయన టైటిల్స్ ని చూస్ చేసుకుంటారట. అంతేకాదు ఆ టైటిల్స్ లో కచ్చితంగా సినిమాకి రిలేటెడ్ గా ఒక మీనింగ్ కూడా తీసుకొస్తారట . ప్రత్యేకంగా ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్స్ పెట్టే విషయంలో ఒక టీం కూడా ఉందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమాకి సంబంధించిన డ్రాగన్ టైటిల్ లుక్ ను రివిల్ చేయబోతున్నారట చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news