Moviesపూజా హెగ్డే తలరాతను మార్చేసే ఆఫర్ ఇది..వాట్ ఏ లక్కీ ఛాన్స్...

పూజా హెగ్డే తలరాతను మార్చేసే ఆఫర్ ఇది..వాట్ ఏ లక్కీ ఛాన్స్ బేబీ..!

ఇది నిజంగా పూజా హెగ్డే అభిమానులకు ఎగిరి గంతేసే న్యూసే .. ఎందుకంటే నిన్న మొదటి వరకు ఇండస్ట్రీలో అవకాశాలు రాక అల్లాడిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ బడాస్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకోవడం నిజంగా నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు . పూజా హెగ్డేని ఈ మధ్యకాలంలో గడ్డి పరక కన్నా చీప్ గా చూసారు జనాలు . ఎంత హాట్ ఎక్స్పోజ్ చేసినా కూడా ఆమె ఫొటోస్ కి సరైన స్పందన ఇవ్వలేదు .

పలువు డైరెక్టర్స్ కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారు. అయితే పూజా హెగ్డే మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి అవకాశాలు దక్కించుకునేలా చేసుకున్నింది. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు టాలీవుడ్ లో ఒక సినిమాకు సైన్ చేసిన పూజ ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన అవకాశం కొట్టేసింది . సూర్యతో జోడిగా నటించే ఛాన్స్ పూజ హెగ్డే కు వరించినట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది .

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య మూవీ చేస్తున్నారు . తన 44వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది . ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే ఫైనలైజ్ చేసారట . ఈ వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది. సూర్య సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో తెలిసిందే. అలాంటి సినిమాలో పూజ నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరియర్ టర్న్ అవుతుంది. ఆ తర్వాత డైరెక్టర్స్ ఆమె ఇంటి ముందు క్యూ కట్టడం పక్క అంటున్నారు జనాలు . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news