Moviesవామ్మో..ప్రభాస్ కోసం కీర్తి సురేష్ నిజంగానే అంత పెద్ద రిస్క్ చేసిందా?...

వామ్మో..ప్రభాస్ కోసం కీర్తి సురేష్ నిజంగానే అంత పెద్ద రిస్క్ చేసిందా? రియల్లీ గ్రేట్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ బాగా వైరల్ అవుతున్నాయి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి . ఈ సినిమాకి సంబంధించి చిన్న అప్డేట్ రిలీజ్ అయినా సరే అభిమానులు ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నారు . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది . కాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సంబంధించి స్క్రాచ్ వీడియోస్ పేరిట కొన్ని అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు నాగ్ అశ్వీన్.

ఈ క్రమంలోనే తాజాగా బుజ్జి అనే పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు . కాగా బుజ్జి అంటే ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానం రీసెంట్గా దొరికేసింది . మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో..? బుజ్జిని కూడా ఒక బ్రెయిన్ అలాగే కంట్రోల్ చేస్తుంది. ఈ బుజ్జి కి వాయిస్ ఓవర్ ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్ . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో మహానటి సినిమాలో నటించిన కీర్తి సురేష్ అప్పటినుంచి ఆయనకు జాన్ జిగిడి దోస్త్ గా మారిపోయింది .

ఆ కారణంగానే ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇప్పించారట . అయితే డబ్బింగ్ విషయంలో మాత్రం కీర్తి సురేష్ కు చుక్కలు చూపించారట . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సార్లు పైగానే కొన్ని వాయిస్ క్లిప్స్ సరిగ్గా లేవు అంటూ డబ్బింగ్ పదేపదే చెప్పించారట . అయినా సరే కీర్తి సురేష్ ఏమాత్రం విసుక్కోకుండా చాలా ఓపికగా నాగ్ అశ్వీన్ ఎలా అయితే కోరుకున్నాడో అలానే వాయిస్ ఓవర్ ఇచ్చిందట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రజెంట్ కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ బిజీ హీరోయిన్గా మారిపోయింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో ఆఫర్ దక్కించుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news