Moviesజస్ట్ మిస్.. సెకండ్స్ లో బిగ్ డేంజర్ నుంచి తప్పించుకున్న...

జస్ట్ మిస్.. సెకండ్స్ లో బిగ్ డేంజర్ నుంచి తప్పించుకున్న హీరోయిన్ కియారా అద్వానీ..!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కుక్కలు చాలా చాలా ప్రమాదకరంగా మారిపోయాయి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలని పీకుని లాక్కొని తినేస్తూ చంపేస్తున్నాయి . నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి. మరి ముఖ్యంగా పెద్దవాళ్లు గాయాలతో బయటపడుతూ ఉంటే కొంతమంది చిన్నపిల్లలు మాత్రం మృత్యు వాత పడుతున్నారు .

దీనికి సంబంధించిన వార్తలను మనం ఎప్పటికీ ఎప్పుడు సోషల్ మీడియాలో వింటూనే వస్తున్నాము. అయితే తాజాగా ఒక హీరోయిన్ అదే సిచువేషన్ ఫేస్ చేసింది. హై సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా కూడా ఒక కుక్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీను వెంబడించిన అంత పని అయింది . దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ ..కియరాని సురక్షితంగా కాపాడారు . అప్పుడే ముంబై ఎయిర్ పోర్ట్ లో కారు దిగిన కీయరా అద్వానీ ని.. వెనక ఒక కుక్క ఫాలో అయింది.

అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు కానీ ..కీయరా అద్వాని వెనకే కుక్క వెంబడించింది . దీంతో కాసేపు బిత్తర పోయిన కీయర.. కుక్క దాదాపు ఆమెకు అడుగు దూరంలో వచ్చేసిన కూడా సెక్యూరిటీ వాళ్లు పట్టించుకోలేదు . ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ కుక్కను తరిమేసి ఆమె సురక్షితంగా ఆమెను కాపాడారు . అంతకంటే ముందే మీడియా వాళ్ళ హడావిడి చూసి కుక్క పారిపోయింది . ఇలా కుక్క దాడి నుంచి అడుగు దూరంలో తప్పించుకుంది అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాన్ని పెళ్లి చేసుకున్న కీయరా అద్వాని పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళుతుంది . అంతేకాదు ఆమె తనదైన స్టైల్ లో సినిమాలను ఓకే చేస్తుంది . తెలుగులోనూ రాంచరణ్ సరసన గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news