Moviesఇప్పుడు ఇండస్ట్రీలో నెం 1 హీరోయిన్ ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు..!!

ఇప్పుడు ఇండస్ట్రీలో నెం 1 హీరోయిన్ ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు..!!

మనకు తెలిసిందే .. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి స్థానం పధిలం కాదు .. మారిపోతున్న ట్రెండ్ కి అభిమానుల రుచులకి ఎప్పటికప్పుడు హీరోయిన్స్ ప్లేసెస్ మారిపోతూనే ఉంటాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం టాప్ టెన్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

గత కొంతకాలంగా ఒక హిట్ కొట్టకపోయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని పధిలంగా తన పేరుపైనే రాయించుకునింది హీరోయిన్ సమంత . నిజానికి విడాకులు తీసుకున్న తర్వాత సమంత క్రేజీ హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా కొట్టలేదు . కానీ ఆమె పేరు మాత్రం అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది . ఆమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది . ఆ తర్వాత రెండవ స్థానంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలబడడం విశేషం .

పెళ్లి అయ్యి కొడుకు పుట్టిన సరే పర్ఫెక్ట్ ఫిజిక్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ రెండో స్థానంలో నిలిచింది . ఇక మూడవ స్థానంలో అనుష్క శెట్టి నిలవడం గమనార్హం. అమ్మడు కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు ఏమీ చేయలేదు. కానీ మూడవ స్థానంలో నిలిచింది. అయితే టాప్ మోస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ఏకంగా నాలుగవ స్థానం కి వెళ్ళిపోయింది . ఇక ఐదవ స్థానంలో సాయి పల్లవి ఆరవ స్థానంలో రష్మిక .. ఏడవ స్థానంలో తమన్నా ఎనిమిదవ స్థానంలో కీర్తి సురేష్ .. తొమ్మిదవ స్థానంలో పూజా హెగ్డే .. పదవ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ చోటు దక్కించుకున్నారు . అయితే హాట్ హాట్ రోల్స్ చేసిన సరే ఆ హీరోయిన్స్ అందరూ టాప్ ఫైవ్ లో లేకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం . ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news