Moviesప్రభాస్ సలార్ 2 లో ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ వరస్ట్ డెసీషన్.. ఫ్యాన్స్...

ప్రభాస్ సలార్ 2 లో ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ వరస్ట్ డెసీషన్.. ఫ్యాన్స్ యాంగ్రీ..ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో ఇది మనం కామన్ గా చూస్తున్నాం . ఒక స్టార్ హీరో సినిమాలో మరొక స్టార్ హీరో నటిస్తూ ఉండడం. అది గెస్ట్ పాత్ర అయినా సరే చాలా పద్ధతిగా నీట్ గా క్లీన్ గా బడా హీరోని చూస్ చూసుకుంటున్నారు డైరెక్టర్ లు. మే బి క్రేజ్ కోసం కావచ్చు.. పబ్లిసిటీ కోసం కావచ్చు.. కారణం ఏదైనా సరే ఇలా ఒక స్టార్ హీరో సినిమాలో మరొక స్టార్ హీరో నటిస్తే అది బాగానే ఉంటుంది . కానీ కొన్నిసార్లు మాత్రం ఆ స్టార్ హీరోకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ సినిమా హిట్ అయిన సరే ఫాన్స్ కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఇప్పటికీ తారక్ ని తక్కువగా చేసి చూపించాడు అని రాజమౌళి పై మండిపడుతున్నారు నందమూరి అభిమానులు .

అయితే మరోసారి అలాంటి బిగ్ రిస్క్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ 2ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడు అనే వార్త బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు అదే జనాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రభాస్ – ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ ..బాగా క్లోజ్ గా ఉంటారు.

అయితే సలార్ 2లో ఎన్టీఆర్ నటించిన తర్వాత సలార్ 2 సినిమా హిట్ టాక్ అందుకున్న తరువాత.. ఎన్టీఆర్ వల్ల అని నందమూరి ఫ్యాన్స్ ..ప్రభాస్ కారణంగానే సలార్ 2 హిట్ అయింది అని రెబెల్ ఫాన్స్ కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఒకవేళ అటు ఇటుగా ఒకరి పాత్ర తగ్గితే మాత్రం కచ్చితంగా అది తలనొప్పులు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రాజమౌళి ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడో అదే సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రశాంత్ నీల్. సినీ విశ్లేషకులు ఇదే విషయంపై హెచ్చరిస్తున్నారు. మరికొందరు ప్రభాస్ సలాడ్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తే ఎవరికి బొక్క ..? అని పోల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు . దీంతో ఈ విషయం గట్టిగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news