Moviesబన్నీకి ఉన్న ఆ గుడ్ హ్యాబిటే ఇంత పెద్ద స్టార్ హీరో...

బన్నీకి ఉన్న ఆ గుడ్ హ్యాబిటే ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యేలా మార్చేసిందా..? ఆ విషయంలో నిజంగా దేవుడే..!

బన్నీ .. అల్లు అర్జున్ .. స్టైలిష్ స్టార్ ఈ మధ్యకాలంలో పుష్ప రాజ్ అంటూ కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఎలా పిలిచినా సరే చాలా నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా పలకరిస్తాడు ఈ ఐకాన్ స్టార్ . ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగిపోయిన ఈ హీరో త్వరలోనే గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు . పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్ .

ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా రీసెంట్గా ఆర్య సినిమా విడుదలై 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది . ఈ క్రమంలోనే ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు . ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది . ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ ..తనకి తన అభిమానులకి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు . ఆర్య సినిమా షూటింగ్ టైంలో న్యూ ఇయర్ వచ్చిందట . ఆ రోజు నైట్ ఫుల్ గా పార్టీ చేసి ఎంజాయ్ చేశారట. అయితే ఆ మరుసటి రోజు ఉదయమే సినిమా షూటింగ్ ఉందట . ఆ విషయాన్ని మర్చిపోయిన బన్నీ రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చేసేసారట . మార్నింగ్ లేవలేక షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకోలేక చాలా చాలా ఇబ్బందులు పడ్డారట.

అప్పుడే ఆయనకు జ్ఞానోదయం అయ్యిందట . ఎప్పుడైనా సరే పక్క రోజు షూటింగ్ ఉంది అంటే ముందు రోజు నైట్ త్వరగా నిద్రపోవాలి. అదే ఉత్తమం లేకపోతే మనం సినిమాకి న్యాయం చేయలేము.. ఆరోజు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాడట అల్లు అర్జున్ . ఇదే విషయాన్ని ఓపెన్ గా స్టేజిపై చెప్పడం గమనార్హం. దీంతో అల్లు అర్జున్ కున్న మంచి హ్యాబిట్ కారణంగానే ఇప్పుడు ఈ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాడు అని.. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో గ్లోబల్ స్థాయిలో కూడా కచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అని బన్నీ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు బన్నీ ఫ్యాన్స్ మా హీరో దేవుడు అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news