Movies"నీకు దండం రా బాబు దయచేసి ఆ పని చేయకు"..డైరెక్టర్ కి...

“నీకు దండం రా బాబు దయచేసి ఆ పని చేయకు”..డైరెక్టర్ కి ప్రభాస్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్తని నమ్మాలో ఏ వార్త నమ్మకుండా ఉండాలి..అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీ సినిమాల విషయంలో మాత్రం అస్సలు గెస్ చేయలేకపోతున్నాం. ఈ వార్త బహుశా అబద్ధం ఏమో..?? ఫేక్ ఏమో..? అని అనుకునే లోపే ఆ వార్తపై అఫీషియల్ ప్రకటన వచ్చేస్తుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద తలనొప్పి క్రియేట్ అయింది .

ప్రెసెంట్ ప్రభాస్ కాన్సన్ట్రేషన్ మొత్తం నాగ్ అస్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా పైనే ఉంది . ఈ సినిమా జూన్ 27వ తేదీ గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడ్డాడో ప్రభాస్ కూడా మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ 2 తో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యారు.

ఇప్పుడు అక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ సినిమా టైటిల్ విషయంలో హను రాఘవపూడి బిగ్ మిస్టేక్ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు కెరియర్ లోనే పరమ చెత్త సినిమాగా నిలిచిన సైనికుడు సినిమా టైటిల్ ని ప్రభాస్ కోసం ఫిక్స్ చేశాడట హను రాఘవపూడి. అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు..? అనేది అర్థం కావడం లేదు . సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకొని మండిపడుతున్నారు . దండం పెడతా దయచేసి ముందు ఆ పని చెయ్ అంటూ టైటిల్ మార్చమని రిక్వెస్ట్ చేస్తున్నారు . సినీ వర్గాలలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news