Moviesసినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న మరో హాట్ హీరోయిన్.. ఏం...

సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న మరో హాట్ హీరోయిన్.. ఏం హింట్ ఇచ్చింది రా బాబు..!

వామ్మో .. ఏంటి ఇది ..? నిజంగానే ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇండస్ట్రీకి టాటా బై బై చెప్పేస్తుందా..? ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలేసింది.

తెలుగుతోపాటు కోలీవుడ్ -బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న టైంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలలో అవకాశాలు దక్కించుకొని చక్రం తిప్పేసింది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక టైం లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ . కాగా రీసెంట్ గానే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని ని ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది .

అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది . అంతేకాదు ఆల్రెడీ ముంబైలో ఆమెకు పలు జిమ్‌స్ ఉన్నాయి. హైదరాబాదులో కూడా జిమ్స్ ఉన్నాయి . అయితే రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతోంది అని .. ఆ కారణంగానే బిజినెస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ పలుచోట్ల బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. నీలాంటి బ్యూటీ ఇండస్ట్రీకి దూరమైతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news