Moviesవరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక్క సినిమా...

వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..? ఆఖరికి అందులో కూడా అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ ఒకపక్క మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరొక పక్క సినిమాలో కూడా దూసుకుపోతున్నాడు. డిసెంట్గా వరుణ్ తేజ్ నటించిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్ .

ఈ సినిమా మార్చి ఒకటిన థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్ . సెకండ్ కూడా గ్యాప్ లేకుండా సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే చిరంజీవి సినిమాలో గెస్ట్ పాత్ర పోషించాను అన్న విషయాన్ని బయట పెట్టాడు వరుణ్ తేజ్ . వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించాడు . ఆ సినిమాలో నాగబాబు – బ్రహ్మానందం కూడా నటించారు.

ఆ సినిమా మరేదో కాదు “హాండ్స్ప్” . ఇది ఒక క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది. శివ నాగేశ్వరరావు డైరెక్ట్ చేశారు . ఈ సినిమాకి హీరోయిన్ జయసుధ కథను అందించడం విశేషం . అంతేకాదు సినిమాలో చిన్న ముఖ్య పాత్ర కూడా పోషించింది. ఈ సినిమాలో ఓ ఫైట్స్ సన్నివేశంలో సోనోసూద్ ని చిరంజీవి కొట్టి పడేస్తాడు . అప్పుడే బుల్లి వరుణ్ తేజ్ వచ్చి ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టీంట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news