Moviesనాగార్జునను "యానిమల్" లో బాగా టెంప్ట్ చేసిన సీన్ ఏంటో తెలుసా..?...

నాగార్జునను “యానిమల్” లో బాగా టెంప్ట్ చేసిన సీన్ ఏంటో తెలుసా..? మన్మధుడు అనిపించాడుగా..!!

నాగార్జున .. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో . వయసు అయిపోతున్న సరే ఇంకా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు . రీసెంట్గా వచ్చిన నా స్వామి రంగా సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . మళ్ళీ తనదైన స్టైల్ లో అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధపడుతున్నాడు . రీసెంట్ గా నాగార్జున బయటపెట్టిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన సినిమా యానిమల్ . డిసెంబర్ ఒకటిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందో మనకు తెలిసిందే. ఈ సినిమా కాంట్రవర్షియల్ గా కూడా మారింది . మరీ బోల్డ్ సీన్స్ పెట్టడం ఏంటి..? అంటూ సందీప్ రెడ్డి వంగాను ఏకిపారేశారు .

కానీ కలెక్షన్స్ మాత్రం 900 కోట్లు క్రాస్ చేసింది . రీసెంట్గా ఈ సినిమాను చూసిన నాగార్జున సినిమాలో తనకు నచ్చిన సీన్స్ పై ఓపెన్ గా చెప్పుకొచ్చేసాడు . ఈ సినిమాలో ఎవరు చూసినా సరే అందరూ బోల్డ్ సీన్స్ గురించే మాట్లాడుతూ వచ్చారు . కానీ నాగార్జున మాత్రం ఈ సినిమాలో ఫైట్ సీన్స్ బాగా నచ్చాయి అని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా మిషన్ గన్ ఫైట్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో నాగార్జున చేసిన కామెంట్స్ కు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news