Moviesఓరి మీ దుంప తెగ.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలా తయారు...

ఓరి మీ దుంప తెగ.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలా తయారు ఏంట్రా బాబు.. ఆరెంజ్ సినిమాలోని పాట ప్లే అవుతుంటే ఏం చేశారో చూడండి (వీడియో)..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి పనిని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా యూత్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి విషయాన్ని కూడా బాగా ఫోకస్ చేస్తుంది . తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన సినిమా ఆరెంజ్ . అఫ్ కోర్స్ ఈ సినిమా ఫ్లాప్ అయింది . కలెక్షన్స్ పరంగా దొబ్బేసింది .

కానీ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకునింది . చాలా డిఫరెంట్ లుక్ లో స్టైలిష్ వేలో రామ్ చరణ్ కనిపించి మెప్పించాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జెనీలియా హీరోగా నటించింది . 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కానీ మ్యూజిక్ మాత్రం అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయ్. మరీ ముఖ్యంగా చరణ్ స్టైలిష్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది .

తాజాగా వైజాగ్ లో మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. ఆ కన్సర్ట్ లో స్టేజిపై ఉన్న సింగర్ కార్తీక్ ఆరెంజ్ మూవీలోని “చిలిపిగా చూస్తావాలా” అనే సాంగ్ ని పాడబోతున్నట్లు తెలియజేశారు . అంతే ఇంకేముంది స్టేజి కింద ఉన్న ఆడియన్స్ ఆ పాటను పాడడం మొదలుపెట్టేశారు. సింగర్ కంటే ముందే లిరిక్స్ పడేసారు. స్టేజ్ పై పాట పాడాల్సిన కార్తీక్ ఏం జరుగుతుందో తెలియక షాక్ లో ఉండిపోయాడు. మ్యూజిక్ కూడా ఆపేశారు. ఆడియన్స్ పాడుతున్నట్లు పాడుతూ పాటని ఆలపిస్తూ నిల్చుని ఉండిపోయారు . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రామ్ చరణ్ క్రేజ్ అంటే ఇదే అంటూ పొగిడేస్తున్నారు. సింగర్ కే షాక్ ఇచ్చాడు మన రామ్ చరణ్ ఫాన్స్ అంటూ ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news