Moviesబిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.."దంగల్" నటి మృతి..కన్నీరు మున్నీరుగా...

బిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..”దంగల్” నటి మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒక స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాదఛాయలు మరవక ముందే మరొక స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం అభిమానులకు మింగుడు పడడం లేదు . రీసెంట్గా చాలామంది స్టార్స్ ని పోగొట్టుకున్న ఫిలిం ఇండస్ట్రీ తాజాగా మరో స్టార్ ని పోగొట్టుకునింది . ప్రజెంట్ దానికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్న అమీర్ ఖాన్ “దంగల్” సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసర్ గా మొదటి స్థానంలో నిలిచింది అంటే కారణం ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అనే చెప్పాలి . ఈ మూవీలో అమీర్ తో పాటు ప్రధాన పాత్రల్లో హీరో కూతుర్లుగా నటించిన ఫాతిమా , సన్యా , సుహాని భట్నాగర్ కూడా తమ నటనతో ఆడియన్స్ ని మెప్పించుకున్నారు . ఆ తర్వాత వీళ్ళు ముగ్గురికి భారీ ఆఫర్లు వచ్చాయి . కాగా ఫాతిమా – సన్యా పలు సినిమాలో నటిస్తూ బిజీగా మారగా ..సుహాని మాత్రం చదువు కోసం బ్రేక్ చెప్పింది .

అయితే వెండితెరపై కనిపించకపోయిన సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ ఉండే ఈ బ్యూటీ ఈ చిన్నారి ఇప్పుడు మన మధ్య లేదు . 19 ఏళ్ల వయసులోనే సుహాని మరణించింది . ఇప్పుడు ఈ విషయమే అందరికీ షాకింగ్ అనిపిస్తుంది. కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం అయ్యింది. కాళ్ళకి గాయం అయింది . ఆ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై నెగటివ్ రియాక్ట్ చూపించాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడం మొదలైంది . ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు . ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. అయినా లాభం లేకుండా పోయింది. చిన్నవయసులోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ న్యూస్ తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news