Movies"వాడి సినిమాలు నాకు అస్సలు నచ్చవు"..తెలుగు స్టార్ హీరో పై పీవి...

“వాడి సినిమాలు నాకు అస్సలు నచ్చవు”..తెలుగు స్టార్ హీరో పై పీవి సింధు షాకింగ్ కామెంట్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయ్. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . కాగా ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాన్ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరు అంటే కచ్చితంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పాలి . అమ్మాయిలకు ఈయన అంటే ఎంత అభిమానమో.. ఎంత పిచ్చో ..ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

లైగర్ సినిమా టైంలో ఏకంగా ఒక అమ్మాయి తన వీపుపై విజయ్ దేవరకొండ బొమ్మను టాటూ గా వేయించుకుంది . మరి కొందరు కాలేజీ ఎగ్గోట్టి మరి ఈయన సినిమాలు చూసేవాళ్ళు. అలాంటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే రీసెంట్ గా బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విజయ్ దేవరకొండపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది పీవీ సింధు .

“ప్రభాస్ నా ఫేవరెట్ హీరో అని .. ఆయన సినిమాలు చాలా బాగుంటాయని.. యాక్టింగ్ చాలా చాలా ఇష్టమని.. ఆయన సినిమాలో మిస్ అవ్వకుండా చూస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు ప్రభాస్ ని కలిసే అవకాశం రాలేదు అంటూ తన మనసులో ఆయన కలవాలి అనే కోరికను బయట పెట్టేసింది. అలాగే రాంచరణ్ అంటే విపరీతమైన అభిమానమని .. ఆయనకు బిగ్ ఫ్యాన్ అని ..నాకు ఒలంపిక్స్ లో మెడల్ వచ్చిన తర్వాత చిరంజీవి గారు నన్ను ఇంటికి పిలిచి సత్కరించిన రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై కూడా పాజిటీవ్ కామెంట్స్ చేసింది . ఆయన యాక్టింగ్ డాన్స్ బాగుంటుంది అంటూ చెప్పుకు వచ్చింది . అయితే విజయ్ దేవరకొండ సినిమాల గురించి మాత్రం ఆమె నెగటివ్గా స్పందించింది . ఆయన సినిమాలు చూశాను కానీ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు” అంటూ విజయ్ దేవరకొండపై షాకింగ్ కామెంట్స్ చేసింది పీవీ సింధు . ప్రజెంట్ ఈ మాటలే వైరల్ అవుతున్నాయి. పీవీ సింధు పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news