Moviesవిజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీస్ ఎంత ఢిఫరెంట్ గా ఉండబోతున్నాయో తెలుసా..?...

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీస్ ఎంత ఢిఫరెంట్ గా ఉండబోతున్నాయో తెలుసా..? మెంటల్ ఎక్కిపోవాల్సిందే..!

విజయ్ దేవరకొండ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకొని తనదైన స్టైల్ లో చక్రం తిప్పేస్తున్నాడు . అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు హీరోలు ఇట్లు కొడుతూ ఉంటారు ప్లాపులు పడుతూ ఉంటాయి. ఆ విషయాన్ని తట్టుకొని నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ . నిజంగా ఒక హీరో హీరోయిన్ కి ఆ క్వాలిటీ చాలా చాలా కావాల్సిందే . ఆ క్వాలిటీ మన విజయ్ దేవరకొండలో కూసింత ఎక్కువ పోర్షన్లోనే ఉంది. కాగా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా మారింది ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న విజయ్ కానీ అది ఫుల్ ఫ్లాప్ అయిపోయింది. అయితే తన సినిమా ఫ్లాప్ అయిందని ఏమాత్రం నిరాశ చెందలేదు . తన నెక్స్ట్ సినిమాలు ఎలా హిట్ అవ్వాలి అని వెయిట్ చేశాడు .

తాజాగా విజయ్ తన 35వ పుట్టినరోజులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా విజయ్ ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు . అంతేకాదు పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్స్ కూడా వచ్చాయి . విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో ప్రెస్టేజియస్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ లో ఒక మూవీకి కమిట్ అయ్యాడు.

ఈ మూవీ పిరియాడిక్ యాక్షన్ డ్రామగా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కూడా అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది . బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడు విగ్రహం ఉంది . దాని మీద ది లెజెండ్ ఆఫ్ ద కార్డ్స్ ల్యాండ్ అని రాసి ఉంది . ఇది 19వ సెంచరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాగా తెలుస్తుంది . అదే విధంగా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు . సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం నిర్మిస్తున్నారు . అదే విధంగా ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ చేసిన విజయ్ మళ్లీ అదే బ్యానర్లో రవికిరణ్ కోలాదర్శకత్వంలో ఒక మూవీకి కమిట్ అయ్యారు.

“కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అనే ఆసక్తికర కొటేషన్ పోస్టర్ రిలీజ్ చేశారు”. కత్తి పట్టుకున్న చేత్తో కూడిన పోస్టర్ ఆసక్తి రేపుతుంది. ఇలా రాబోయే మూడు సినిమాలకు కూడా విజయ్ దేవరకొండ కెరియర్ ని మలుపు తిప్పబోతున్నాయి అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news