Moviesమహేష్ బాబు - నాని కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్...

మహేష్ బాబు – నాని కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు లాస్ట్ గా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల – మీనాక్షి చౌదరి నటించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రసెంట్ మహేశ్ బాబు ..రాజమాఉళి సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఆ సినిమా కోసం కష్టపడుతున్నాడు . ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది .

కాగా సోషల్ మీడియాలో మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన సినిమా మహర్షి . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించింది . అంతేకాదు అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్రలో మెరిశారు .

నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా హీరో నానిను అప్రోచ్ అయ్యారట మేకర్స్ . కానీ నాని ఇది గెస్ట్ పాత్రలా ఉండడంతో పైగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో లీడ్ లేని పాత్ర కావడంతో రిజెక్ట్ చేశారట . సోషల్ మీడియాలో ఈ వార్త అప్పుడు బాగా ట్రెండ్ అయింది. అంతేకాదు అభిమానులు కూడా ఓ రేంజ్ లో నాని పై మండిపడ్డారు. అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news