Moviesశ్రీలీల‌ను టాలీవుడ్‌లో టార్గెట్ చేస్తోందెవ‌రు.. అసలు విల‌న్లు ఎవ‌రు... తెర‌వెన‌క ఏం...

శ్రీలీల‌ను టాలీవుడ్‌లో టార్గెట్ చేస్తోందెవ‌రు.. అసలు విల‌న్లు ఎవ‌రు… తెర‌వెన‌క ఏం జ‌రుగుతోంది..!

త‌క్కువ టైంలోనే బాగా పాపుల‌ర్ అయిన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల మీద ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ, బ‌య‌టా భ‌యంక‌ర‌మైన ట్రోలింగ్ న‌డుస్తోంది. వ‌రుస‌గా హిట్లు ప‌డ్డాయి. అయితే గ‌త నాలుగు నెల‌లుగా ఆమె న‌టించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆదికేశవ – ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ – స్కంధ – తాజాగా సంక్రాంతికి వ‌చ్చిన మ‌హేష్‌బాబు గుంటూరు కారం సినిమా మీద ఆమె భారీ ఆశ‌లు పెట్టుకున్నా అవి కూడా నెర‌వేర‌లేదు.

ఇక ఇప్పుడు ఆమె ఆశ‌ల‌న్నీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా మీదే ఉన్నా అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. వ‌రుస ప్లాపులు.. ఇటు స‌రైన ఛాన్సులు రాని నేప‌థ్యంలో ఆమె సినిమాలో ఉంటే ఆ సినిమా మ‌టాషే.. ఆమె పెద్ద ఐరెన్‌లెగ్గు అని ముద్ర వేసేస్తున్నారు. ఒక ప‌గ‌డ్బందీ ప్లాన్ ప్ర‌కారం ఆమెపై భారీగా ట్రోలింగ్ న‌డుస్తోంది. వాస్త‌వంగా చూస్తే శ్రీలీలే ఐరెన్‌లెగ్గా ? మ‌రి ఆమె ప‌క్క‌న న‌టించిన హీరోల ప‌రిస్థితి ఏంటి ? వాళ్ల‌కు వ‌రుస‌గా అన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు ఉన్నాయా ? అన్న‌ది చూద్దాం.

వ‌రుణ్‌తేజ్‌కు తొలి సినిమా ఉప్పెన త‌ర్వాత హిట్ లేదు. ఆదికేశ‌వ ప్లాప్ శ్రీలీల మీద తోసేస్తే ఎలా ? ఇక నితిన్ హిట్టు కొట్టి యేళ్ల‌వుతోంది. అత‌డి ముందు సినిమాలు వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు.. ఇప్పుడు నితిన్ ప‌క్క‌న ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా చేసినా అది క‌లిసి రాలేదు. రామ్ – బోయ‌పాటి స్కంద డిజాస్ట‌ర్‌. ఇవ‌న్నీ ప్లాపులు అనుకున్నా మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ మ్యాజిక్ ఏమైంది.. గుంటూరు కారం కూడా భారీ హిట్ కాలేదు.

ఇలా వ‌రుస‌గా నాలుగు సినిమాలు అంచ‌నాలు అందుకోలేక‌పోవడంతో ఇప్పుడు అంద‌రూ శ్రీలీల మీద ప‌డ్డారు. ఆమెను ఐరెన్‌లెగ్‌గా ముద్ర వేసుకుంటున్నారు. ఆమె ఖాతాలో ఉన్న పెళ్లిసంద‌డి – ధ‌మ‌కా – భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలు సూప‌ర్ హిట్లు.. వాటి గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌డం లేదు. పైగా భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో ఆమె పాత్ర అద్భుతం.. చిన్న వ‌య‌స్సులోనే ఆమె ఎంతో ప‌రిణితి చెందిన పాత్ర‌లో న‌టించింది.

ఒక్క భ‌గ‌వంత్ కేస‌రి పాత్ర త‌ర్వాత ఆమె చేసిన ప్లాపు సినిమాల్లో ఒక్క‌టి ఆమెను ఎలివేట్ చేసే పాత్ర ఇవ్వ‌లేదు. దీనికి ఆమెపై నింద వేయ‌డం ఎందుకు ? వ‌రుస‌గా రెండు , మూడు ప్లాపులు రాగానే కావాల‌నే శ్రీలీల‌ను టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. కావాల‌నే కొన్ని గ్రూపులు, కొంద‌రు హీరోయిన్ల పీఆర్ టీంలు శ్రీలీల‌కు యాంటీగా ఆర్టిక‌ల్స్ లీకులు, ట్రోలింగ్ వెన‌క ఉన్న‌ట్టు టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news