Newsవామ్మో..అప్పుడే మహేశ్ కి చుక్కలు చూపిస్తున్న రాజమౌళి.. ఇలా అయితే కష్టం...

వామ్మో..అప్పుడే మహేశ్ కి చుక్కలు చూపిస్తున్న రాజమౌళి.. ఇలా అయితే కష్టం జక్కన్న..!

వామ్మో.. ఏంటిది జక్కన్న అప్పుడే మన మహేష్ బాబుకు చుక్కలు చూపించేస్తున్నాడా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . జనరల్ గా రాజమౌళి దర్శకత్వంలో ఒక హీరో నటిస్తున్నాడు అంటే కచ్చితంగా హీరోకి టార్చర్ తప్పదు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి . ప్రభాస్ – రవితేజ – తారక్ – చరణ్ లాంటి స్టార్ హీరోలు కూడా జక్కన్న చేతిలో నలిగిపోయారు అన్న విషయం అందరికీ తెలిసిందే .

త్వరలోనే రాజమౌళి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పనులను కూడా ప్రారంభించేసాడు జక్కన్న . అయితే మహేష్ బాబుకు ఇప్పటినుంచి కఠిన డైట్ ఫాలో అయ్యే విధంగా కొత్త న్యూట్రిషియన్ ని ఏర్పాటు చేశారట . మొదటి నుంచి మహేష్ బాబు డైట్ బాగా చేస్తారు .

అయితే రాజమౌళి తన సినిమాకు తగ్గ లుక్స్ కోసం మహేష్ బాబును తీవ్రంగా కష్టపడుతున్నారట . రోజుకి 8 గంటల జిమ్ తో పాటు కఠిన ఆహార డైట్ కూడా చేయమంటూ బలవంతం చేస్తున్నారట . అంతేకాదు మహేష్ బాబు ఎంత ఇష్టంగా డైట్ చేస్తున్న కూడా ఆయన లుక్స్ పట్ల రాజమౌళి ఇంకా సాటిస్ఫై అవ్వలేదట . ఈ విషయం కారణంగా ఇద్దరు డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news