Newsయానిమల్ సినిమా సీన్స్ ఆ మూవీ నుండి కాపీ కొట్టాడా..? మరీ...

యానిమల్ సినిమా సీన్స్ ఆ మూవీ నుండి కాపీ కొట్టాడా..? మరీ ఇంత ఫోజ్ కొడుతున్నావేంటి డైరెక్టరో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్ . రన్బీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు.

డిసెంబర్ ఒకటవ తేదీ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని లాంచ్ చేశారు మేకర్స్ . ట్రైలర్ ఫుల్ గా అభిమానులు ఆకట్టుకుంటుంది . రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా సినిమాలోని సీన్స్ అద్భుతంగా ఉన్నాయి అంటూ తెలిసిపోతుంది . అయితే ఫేస్ కి మాస్క్ పెట్టుకొని చేసిన ఫైట్ సీన్ ఎక్కడో చూసినట్లు ఉంది అంటూ అభిమానులు ఆరాతీస్తున్నారు .

అయితే అదిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమాలోని ఫైట్ సీన్స్ తలపిస్తున్నాయి అంటూ కొందరు కనిపెట్టేశారు . మరికొందరు ఆ సినిమా సీన్స్ ని కాపీ కొట్టేసావా డైరెక్టర్ అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తుంటే .. కాపీ సినిమాకి ఇంత ఫోజ్ కొడుతున్నావేంటి ..? అంటూ మరికొందరు దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news