Moviesదట్ ఈజ్ నాని.. ఆ ధైర్యం మిగతా హీరోలకు లేకుండాపోయిందే.. కడుపుకు...

దట్ ఈజ్ నాని.. ఆ ధైర్యం మిగతా హీరోలకు లేకుండాపోయిందే.. కడుపుకు తిన్నేది అన్నమేగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉండే జనాలు ఇవే కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ హీరో నాని కి ఉన్న ధైర్యం మిగతా హీరోలకు లేకుండా పోయింది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . దానికి కారణం రీసెంట్గా నేచురల్ స్టార్ నాని బాలీవుడ్ లోనే టాప్ టాక్ షో అయినా కాఫీ విత్ కరణ్ షోపై చేసిన కామెంట్స్ నే.. మొదటి నుంచి నాని చాలా డేర్ గా మాట్లాడుతూ ఉంటాడు ..ఉన్న విషయం ఉన్నట్లు మాట్లాడేస్తాడు .

అందుకే ఆయనంటే చాలామంది జనాలకు భయం కొంతమంది ఆయనను అసలు సపోర్ట్ కూడా చేయరు .. ఎందుకంటే ఆయన నిజాలు మాట్లాడుతాడు కాబట్టి . కాగా రీసెంట్ గా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాని బాలీవుడ్ టాక్ షో అయిన కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశంలో కాఫీ విత్ కరన్ షో కి పిలిస్తే మీరు వెళ్తారా..? అని అడగ్గా.. నాని దానికి ఆన్సర్ ఇస్తూ ..”కాఫీ విత్ కరణ్ షో కి పిలిచిన రాను అని గౌరవంగా చెప్పేస్తాను ..కరణ్ జోహార్ ని కలిసి సినిమాల గురించి కాసేపు మాట్లాడమంటే ఓకే కానీ.. ఆ షో కి మాత్రం వెళ్ళను ..నాలాంటి వాళ్ళకి ఆ షో అసలు సెట్ అవ్వదు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.

అయితే నాని మాట్లాడిన మాటలు పూర్తిగా వాస్తవం అంటున్నారు జనాలు. ఆ షోలో వల్గారిటీ.. సెక్స్ గురించి తప్పిస్తే సినిమాల గురించి అసలు ప్రశ్నలు ఉండవని బోల్డ్ కంటెంట్ ఉంటుందని ..నాని లాంటి సాఫ్ట్ హీరో అలాంటి షోస్ కి.. వెళ్లకపోవడమే కరెక్ట్ ..అందుకే ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పేసాడు.. అని మన ఇండస్ట్రీలోని పలువురు హీరోలు మాత్రం ఆ విషయాన్ని చెప్పలేక ..మింగలేక .. కక్కలేక అయిష్టం గానే.. ఆ షోకి వెళ్లి ఆయన పెట్టింది తినేసి ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేసి వచ్చారని వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news