Newsపుట్టిన రోజుకు 24 గంటల ముందే ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్...

పుట్టిన రోజుకు 24 గంటల ముందే ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య.. అభిమానులకి రాత్రి నిద్రపట్టదు అంతే(వీడియో)..!

నవంబర్ 23 .. అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఆయన అభిమానులు రకరకాల పోస్టులతో ఆయనకు బర్త్డ డే కి విషెస్ ను అందించడానికి రెడీ అయిపోతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కాగా అక్కినేని నాగచైతన్య ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే .

భారీ ఎక్స్పెక్టేషన్స్ తో నటించిన వెబ్ సిరీస్ “దూత” నెక్స్ట్ వీక్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చురుగ్గా పాల్గొంటున్న నాగచైతన్య పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు . అభిమానుల ఇంటికి అతిథిగా వెళ్లడమే కాకుండా అభిమానుల కోసం భారీ నిర్ణయం కూడా తీసుకున్నారు .

రీసెంట్గా ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్యకు బర్త్డ డే విషెస్ తెలియజేయాలంటే ఎలా చేస్తారు అని పోస్ట్ నిఖిల్ ప్రశ్నిస్తూ ఉండగా ..మధ్యలో చైతన్య ఎంట్రీ ఇస్తాడు . దీంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు . అలా వచ్చిన చైతన్యతో సరదాగా మాట్లాడడమే కాకుండా చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చి పంపిస్తారు. ఆ గిఫ్ట్ ని అపురూపంగా తీసుకుంటాడు నాగచైతన్య. అంతేకాదు ఇకనుంచి నా సినిమాలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి అంటూ కూడా ప్రామిస్ చేశాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news