Newsనాగచైతన్య-సాయి పల్లవి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ "దేవర" ను డిట్టొగా...

నాగచైతన్య-సాయి పల్లవి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ “దేవర” ను డిట్టొగా దింపేశాడుగా..!!

నాగచైతన్య అభిమానులకి ఒకరోజు ముందుగానే బర్త్డ డే ట్రీట్ అందిపోయింది. నవంబర్ 23 అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు . ఈ క్రమంలోనే ఆయన పుట్టినరోజుకు కొన్ని గంటల ముందే ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ చేసేసారు మేకర్స్. మనకు తెలిసిందే వరుసగా భారీ ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.

ఈ సినిమాకి సంబంధించి చాలా బ్యాక్ గ్రౌండ్ వరకు కూడా చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంచెం ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రిలీజ్ చేశారు . ఈ సినిమాకి “తండేఅల్” అంటూ టైటిల్ ఫిక్స్ చేశారు. నాగ చైతన్య సరసన ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తోంది . కాగా 2018లో గుజరాత్ నుంచి 21 మంది మత్యకారులు వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గాడ్ చెరలో చిక్కుకో గా అందులో ఉన్న ఆంధ్ర మత్స్య కారుడు కధ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు.. ఇటీవల నిర్మాతలు ప్రకటించారు .

దీంతో సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది . అంతేకాదు రిలీజ్ అయిన పోస్టర్ ఆధారంగా చూస్తుంటే ఇది డిట్టో ఎన్టీఆర్ దేవర సినిమాకు కాపీగా తెలుస్తుంది అంటున్నారు అభిమానులు . ఆ గడ్డం ఆ జుట్టు ఆ మాస్ లుక్ .. మొత్తంగా ఎన్టీఆర్ దేవరను కాపీ కొట్టేసినట్లే ఉన్నారు అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news