Newsటాలీవుడ్‌లో మ‌రో పెళ్లిసంద‌డి... ఆంధ్రా అల్లుడ‌వుతోన్న తెలంగాణ హీరో...!

టాలీవుడ్‌లో మ‌రో పెళ్లిసంద‌డి… ఆంధ్రా అల్లుడ‌వుతోన్న తెలంగాణ హీరో…!

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీట‌లేకుతున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి త్వరలోనే ఇటలీలో జరగనుంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హ‌య‌వాహిని ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి శ్రీ సింహకు ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ మనవ‌రాలు రాగతో పెళ్లి జరగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో కూడా పెళ్లి బాజాలుమోగ‌నున్నాయి.

దిల్ రాజు సోదరుడు అయిన సురేష్ కుమారుడు హీరో ఆశీష్ రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.
రౌడీ బాయ్స్ సినిమాతో గత ఏడాది ఆశిష్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆశిష్ త్వరలోనే సెల్ఫీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

కొద్ది రోజుల క్రితం దిల్ రాజు.. శిరీష్ తండ్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ఈ కుటుంబంలో శుభకార్యం జరిపితే మంచి జరుగుతుందన్న అభిప్రాయంతో తమ వారసుడు ఆశీష్‌కి పెళ్లి చేయాలని వారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజుది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు వీరు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంతో వియ్యం అందుకుంటున్నట్టు తెలుస్తోంది.

వీరి పెళ్లి పూర్తిగా పెద్దలు కుదిరిచినట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఎంగేజ్మెంట్ పూర్తి చేసి వచ్చేయేడాది ప్రారంభంలో సంక్రాంతి తర్వాత ఆశిష్ పెళ్లి జరిపేలా ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఆశిష్ హీరోగా పరిచయం అయిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news