Moviesప‌వ‌న్ న‌డుము చూసిన భూమిక ఏజ్ ఎంతో తెలుసా… మ‌హేష్‌, ఎన్టీఆర్‌కు...

ప‌వ‌న్ న‌డుము చూసిన భూమిక ఏజ్ ఎంతో తెలుసా… మ‌హేష్‌, ఎన్టీఆర్‌కు ఆమె ఇంత హెల్ఫ్ చేసిందా..!

అందాల తార భూమికా చావ్లా గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆమె తెలుగులో క‌రుణాక‌ర‌న్ హీరోగా వ‌చ్చిన అక్కినేని మ‌న‌వ‌డు సుమంత్ కు జోడీగా యువ‌కుడు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. అయితే ఆ సినిమా స‌క్సెస్ కాలేదు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి సినిమాలో ఆమెకు ఛాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

దీంతో భూమిక‌కు ఆ త‌ర్వాత తిరుగులేని క్రేజ్ వ‌చ్చేసింది. వెంట‌నే ఎన్టీఆర్‌, మ‌హేష్‌, చిరంజీవి, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇక ఖుషి సినిమాలో ప‌వ‌న్ – భూమిక మ‌ధ్య వ‌చ్చే న‌డుము సీన్ అయితే ఇప్ప‌ట‌కీ ఓ క్రేజీ సీన్‌. ఈ రోజు భూమిక పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది. ఆమె 1978 ఆగ‌స్టు 21న జ‌న్మించారు. ఆమె వ‌య‌స్సు 45 సంవ‌త్స‌రాలు.

భూమిక‌కు టాలీవుడ్ లో ముగ్గురు క్రేజీ హీరోలు ప‌వ‌న్ – మ‌హేష్ – ఎన్టీఆర్ ముగ్గురి కెరీర్‌కు ఓ లింక్ ఉంది. ఈ ముగ్గురు స్టార్ హీరోల కెరీర్‌లో 7వ సినిమాలుగా వ‌చ్చిన ఖుషి – ఒక్క‌డు – సింహాద్రి సినిమాల్లో ఆమె హీరోయిన్‌. అలా ఈ మూడు సినిమాల్లోనూ ఆమే హీరోయిన్ కావ‌డం.. మూడు సూప‌ర్ హిట్లు అవ్వడంతో పాటు ఆ టైంలో ఇండ‌స్ట్రీ హిట్లు కావడం ఓ సెన్షేష‌న‌ల్ అని చెప్పాలి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news