Movies"భగవంత్ కేసరి" సినిమా అనిల్ రావిపూడి ఆ హీరోతో చేయాలి అనుకున్నాడా..?...

“భగవంత్ కేసరి” సినిమా అనిల్ రావిపూడి ఆ హీరోతో చేయాలి అనుకున్నాడా..? మిస్ చేసి మంచి పని చేసాడు.. లేకపోతే డిజాస్టరే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన వార్తల ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా తాజాగా రిలీజ్ అవుతున్న అప్డేట్ ప్రతి ఒక్కటి అభిమానులకు ఊపు తెప్పిస్తుంది . ఈ వయసులోనూ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి బాలయ్య చేస్తున్న రిస్కులకు హ్యాట్సాఫ్ అని చెప్పాలి . ఇప్పటివరకు మనం బాలయ్యను తెరపై చూడని విధంగా చూపించబోతున్నాడు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

అయితే భగవంత్ కేసరి సినిమాను అనుకున్నప్పుడు ముందు అనిల్ రావిపూడి తెలుగులో మాస్ హీరోగా ఉన్న రవితేజతో ఈ సినిమా తెరకెక్కించాలని భావించారట . ఆల్రెడీ వీళ్లిద్దరు కాంబోలో “రాజా ది గ్రేట్ ” అనే సినిమా వచ్చింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఇదే క్రమంలో ఈ కథ రవితేజకు సూపర్ గా ఉంటుంది అంటూ ఆయనను అప్రొచ్ అయ్యి వివరించారట .

కానీ ఎందుకో రవితేజకు ఈ కథ పెద్దగా నచ్చలేదు అని తెలుస్తుంది. రిజెక్ట్ చేసారట. అయితే ఇదే క్రమంలో ఈ పాత్రకు టాలెంటెడ్ హీరో బాలయ్య అయితే బాగుంటాడు అని ఓ ఫ్రెండ్ సజీషన్ మేరకు అనిల్ రావిపూడి బాలయ్యను కలిసి స్టోరీ వివరించగ.. ఆయన స్పాట్లోనే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేశాడట . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అనిల్ రావిపూడిని అప్రిషియేట్ చేస్తున్నారు . మంచి పని చేశావు.. ఒకవేళ రవితేజతో తీసి ఉంటే ఈ సినిమా డిజాస్టర్ అయ్యేది.. బాలయ్య కాబట్టి ఈ సినిమాకి న్యాయం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news