Movies"నీహారిక లాంటి వారు ఎందరో"..మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

“నీహారిక లాంటి వారు ఎందరో”..మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

మనకు తెలిసిందే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ..తెలుగు బ్యూటీలకి ఆఫర్లు ఇవ్వరు . ఈ కామెంట్స్ ఇప్పుడు కాదు.. ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి .సినిమా ఇండస్ట్రీలో ఎంత పాపులారిటీ తెచ్చుకున్న ..ఎంత అందంగా ఉన్నా ..తెలుగు అమ్మాయిలకు మాత్రం అవకాశాలు ఇవ్వరు ఈ తెలుగు డైరెక్టర్లు . దానికి కారణం ఏంటో వాళ్లకే తెలియాలి . పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్నా కూడా తెలుగు మాట్లాడగలిగిన.. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయిన ఇవ్వగలిగిన ఈ డైరెక్టర్స్ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదు .

ఇప్పటికే ఈ విషయాన్ని ఎంతోమంది ఇంటర్వ్యూలో బయటపెట్టారు . అయితే రీసెంట్ గా అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది మంచు లక్ష్మి . మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అన్న విషయాన్ని మరోసారి గట్టిగా చెప్పింది .

ఈ క్రమంలోనే ఇక్కడే పుట్టిన నిహారిక , శివాత్మిక, శివాని , బిందు మాధవి లాంటి అమ్మాయిలకి తెలుగు డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వరు.. ఎందుకని..? వీరందరూ దేనిలో తక్కువ ..? అందంతో పాటు టాలెంట్ ఉంది..? మరి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు.. ఇక్కడ ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్ కూడా ముంబై – పంజాబీ – కేరళ – తమిళ్ – కన్నడ హీరోయిన్లే కావాలి. అందుకే తెలుగు అమ్మాయిలు ఎదగలేకపోతున్నారు అంటూ ఫైర్ అయిపోయింది . దీంతో మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ విని జనాలు సైతం నిజమే కదా అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news