Moviesవావ్: అలా చేసిన ఫస్ట్ టాలీవుడ్ హీరో మన ఎన్టీఆరే..ఫ్యాన్స్ పిచ్చ...

వావ్: అలా చేసిన ఫస్ట్ టాలీవుడ్ హీరో మన ఎన్టీఆరే..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

వావ్: అలా చేసిన ఫస్ట్ టాలీవుడ్ హీరో మన ఎన్టీఆరే..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్న బోలెడంత మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్న తారక్ నే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు జనాలు. దానికి రీజన్ అయిన టాలెంటెడ్ నటుడు..ఆయన డాన్స్ అని చెప్పాలి. కాగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే తారక్ ట్విట్టర్ – ఇన్ స్టాల్ లో టాప్ పొజిషన్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు .

కాగా రీసెంట్ గా ఎన్టీఆర్ “ధ్రేడ్స్” యాప్ లో జాయిన్ అయ్యారు . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు . దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఎన్టీఆర్ని ఫాలో అవుతున్నారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ కు పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్‌ ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. థ్రెడ్స్ యాప్ ప్లే‌స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు.

గంటగంటకు థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్స్ పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో కూడా థ్రెడ్ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కాగా ట్విట్టర్ – ఇంస్టాగ్రామ్ ఫీచర్స్ కలగజేసి ఉండడంతో ఇది త్వరలోనే బాగా పాపులారిటి అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు. అయితే టాలీవుడ్ హీరోలలో మొదటగా ఎన్టీఆర్ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అభిమానులకి సర్ ప్రైజ్ ఇచ్చారు.ఈ క్రమంలోనే తారక్ కోసం ఈ యాప్ ని నందమూరి అభిమానులు అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. చూద్దాం మిగతా స్టార్స్ ఈ యాప్ ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఫాన్స్ ని ఖుషి చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news