Movies"గుంటురు కారం" నుండి ఊహించని అప్డేట్ .. మహేశ్ బాబు అభిమానులకి...

“గుంటురు కారం” నుండి ఊహించని అప్డేట్ .. మహేశ్ బాబు అభిమానులకి ఇంత దెబ్బ వేశావ్ ఏంటి త్రివిక్రమ్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా పూజా హెగ్డే రెండవ హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో అభిమానులను తెగ ఆకట్టుకునింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లంగా వోణిలో చాలా ట్రెడిషనల్ గా ఆకట్టుకున్న శ్రీ లీల.. ఈ సినిమాతో మంచి హిట్ను అందుకుంటుంది అన్న నమ్మకం జనాల్లో కలిగింది.

కాగా ఇదే క్రమంలో మహేష్ బాబు సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ తప్పుకున్నాడు అనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . మనకు తెలిసింది మహేష్ బాబు సినిమాకు సంగీతం అందిస్తున్నారు తమన్. కాగా ఇదే క్రమంలో బాలయ్య సినిమాకు తమన్ నే సంగీతం అందిస్తున్నారు . రీసెంట్గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన భగవంత్ కేసరి టీజర్ లో మ్యూజిక్ అదరగొట్టేశాడు. అదే మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గుంటురు కారం టీజర్ లో మాత్రం అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేదు .

ఈ క్రమంలోనే మహేష్ ఫ్యాన్స్ మండిపడ్డారు .సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా తమను తీసేయమంటూ ఫైర్ అయ్యారు . అయితే రీసెంట్గా ఆహాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు బన్నీ కలిసి చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకునింది, ఆశ్చర్యం ఏంటంటే దీనికి కూడా మ్యూజిక్ చేసింది ఎస్ఎస్ తమనే.. ఈ క్రమంలోని తమన్ మహేష్ బాబుకు తప్పిస్తే మిగతా అందరికీ బాగా మ్యూజిక్ వాయిస్తున్నాడు అని ఈ కోపంలోనే మహేష్ బాబు తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసేయమన్నాడు అంటూ వార్తలు వినిపించాయి .

దీంతో గుంటూరు కారం సినిమా టీం అలర్ట్ అయింది , అదంతా ఫేక్ వార్తలు అంటూ కొట్టి పడేసింది . సోషల్ మీడియా వేదికగా గుంటూరు కారం సినిమా టీమ్స్ స్పందించింది “మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుండి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం . ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది . జనవరి 13న రిలీజ్ అవుతుంది ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఉంటే మాత్రం ఒక రోజు ముందే రిలీజ్ చేస్తాం ” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాపై సర్కులేట్ అవుతున్న వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టి పడేసింది చిత్ర బృందం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news