Moviesపూజా హెగ్డే నోటి దూల ..త్రివిక్రమ్ ను అంత మాట అన్నిందా..?...

పూజా హెగ్డే నోటి దూల ..త్రివిక్రమ్ ను అంత మాట అన్నిందా..? మరో భారీ బొక్క పడ్డిందిగా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను తీసేసారా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే టైం అసలు బాగోలేదు. పట్టిన ప్రాజెక్ట్ లు అన్ని నెగటివ్ గానే పోతుంది. మరికొన్ని చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి . ఇలాంటి క్రమంలోనే అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే ఖాతాలో ఉన్న ఒకే ఒక్క టాలీవుడ్ సినిమా కూడా చేజారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మనకు తెలిసిందే గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే సెలక్ట్ అయినట్టు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ త్రివిక్రమ్ కారణంగా పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పూజా హెగ్డే త్రివిక్రమ్ పై గుర్రుగా ఉంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

పూజా పూజా హెగ్డే కన్న శ్రీలీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని.. కథ పరంగా కంటెంట్ పరంగా కూడా ఆమెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ పూజ హెగ్డే తక్కువ చేశారని.. ఈ క్రమంలోనే కోపంతో పూజ హెగ్డే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసిందట. అంతే కాదు అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసింది అన్న రూమర్ ఘాటుగా వైరల్ అవుతుంది. దీనిపై గుంటూరు కారం టీం కానీ పూజ హెగ్డే కానీ స్పందించకపోతే ఈ వార్త నిజమే అని నమ్మవాలనుకుంటున్నారు జనాలు.. చూద్దాం చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news