Moviesథ‌మ‌న్ ' బ్రో ' మ‌ళ్లీ కాపీ కొట్టేశాడు... ఆ...

థ‌మ‌న్ ‘ బ్రో ‘ మ‌ళ్లీ కాపీ కొట్టేశాడు… ఆ స్టార్ హీరో ట్యూన్ ఎత్తి బ్రోకు దించేశాడు ( వీడియో )

టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న థ‌మ‌న్ అస‌లు గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. థ‌మ‌న్ చాలా త‌క్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోతున్నాడు. అయితే థ‌మ‌న్ పై కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కాపీ క్యాట్ అన్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. థ‌మ‌న్ ఎప్పుడు ఏ పాట చేసినా.. ఏ ట్యూన్ క‌ట్టినా ఎక్క‌డో ఓ ట్యూన్‌ను కాపీగా పోలి ఉండ‌డం ఇటీవ‌ల కామ‌న్ అయ్యింది.

తాజాగా పవన్ స్టార్ పవన్ కల్యాణ్ – ప‌వ‌న్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ న‌టిస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ “బ్రో” సినిమాపై ఓ మోషన్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ వీడియోలోనే ఈ సినిమాకు బ్రో అన్న టైటిల్ క‌న్‌ఫార్మ్ చేశారు. అయితే అందులో ఉన్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరింద‌ని నిన్న‌టి నుంచి మెగా, ప‌వ‌న్ అభిమానులు ఊద‌ర‌గొట్టేసుకుంటున్నారు.

అయితే ఇది కూడా థ‌మ‌న్ కాపీ కొట్టాడంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. మ‌ళ్లీ థ‌మ‌న్ ఓ ట్యాన్ యాజ్ టీజ్‌గా దింపేశాడంటున్నారు. అక్ష‌య్ కుమార్ బ్లూ సినిమా టైటిల్ సాంగ్ నుంచి బ్రో మోష‌న్ పోస్ట‌ర్ థీయ్ అచ్చుగుద్దిన‌ట్టు దింపేశాడంటున్నారు. ట్యూన్‌ను కాస్త అటూ ఇటూగా మార్చేసి… మిగిలింది అంతా మొత్తం దింపేశాడ‌నే అంటున్నారు.

బ్రో థీమ్ సాంగ్‌కు, బ్లూ టైటిల్ సాంగ్‌కు పెద్ద తేడా లేద‌నే అంటున్నారు. థ‌మ‌న్ మ‌రోసారి అడ్డంగా దొరికిపోవ‌డంతో థ‌మ‌న్ కాపీ క్యాట్ అంటూ మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ట్రోలింగుల గోల‌, ర‌చ్చ మొద‌లైంది. థ‌మ‌న్ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే ట్యూన్ ఎత్తి దించేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతున్నాయి. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా అంత స్పీడ్‌గా మ్యూజిక్ ఇచ్చే వాళ్లు లేక‌పోవ‌డంతో ఇక్క‌డ స్టార్ హీరోల‌కు కూడా థ‌మ‌నే గ‌తి అవుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news