Moviesమహేశ్ బాబు కి అక్క గా స్టార్ హీరోయిన్.. త్రివిక్రమ్ ధింకింగ్...

మహేశ్ బాబు కి అక్క గా స్టార్ హీరోయిన్.. త్రివిక్రమ్ ధింకింగ్ కి దండేసి దండం పెట్టాల్సిందే రా బాబు..!!

ఎస్ .. ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ప్రెసెంట్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు పెట్టిన ఈ సినిమా #ఎస్ఎస్ఎంబి 28 అనే వర్కింగ్ టైటిల్ లో షూటింగ్ జరుపుకుంటుంది . ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి రెడీగా ఉంది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మహేష్ బాబు సినిమాలో ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించబోతున్నాడట, ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు లాంటి హ్యాండ్ సమ్ హీరో సినిమాలో కాజల్ లాంటి అందమైన హీరోయిన్ అక్క పాత్రలో నటిస్తే ఖచ్చితంగా ఆ సినిమాకి మరింత హైప్ రావడం పక్కా అంటున్నారు అభిమానులు.

అంతేకాదు గతంలో అందాల నటి నదియా ని కూడా అత్తారింటికి దారేది సినిమాలో కీలకపాత్రలో చూపించి ఆమె కెరియర్ ని టర్న్ చేసారు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కాజల్ ఇక అవకాశాలు అందుకుంటుంది అని.. ఆమె కెరియర్ దశతిరిగిపోయినట్టే అని చెప్పుకొస్తున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news