Moviesక్రేజీ వీడియోతో ' ప‌వ‌న్‌ OG ' నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్...

క్రేజీ వీడియోతో ‘ ప‌వ‌న్‌ OG ‘ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వ‌రుస పెట్టి సినిమాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం హ‌రిహార వీర‌మ‌ల్లు సినిమా చేస్తోన్న ప‌వ‌న్ అటు సాయితేజ్‌తో క‌లిసి వినోద‌య సితం సినిమా రీమేక్‌లో కూడా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు కోలీవుడ్ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌ఖ‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ప‌వ‌న్ పార్ట్ కూడా పూర్త‌య్యింది.

ఇక హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో పాటు సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో మ‌రో సినిమాలోనూ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఫ్యాన్స్ అయితే ఓజీ సినిమా కోసం ఓ రేంజ్‌లో ఎగ్జైట్ అవుతున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్‌డేట్ వ‌స్తుంద‌ని మేక‌ర్స్ నుంచి సిగ్న‌ల్స్ వ‌చ్చాయి.

ఈ సంకేతాలు నిజం చేస్తూ ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు టైం లాక్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అస‌లు ఈ వీడియో అయితే నెక్ట్స్ లెవ‌ల్లో ఉంది. సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేసింది. సుజిత్ స్టైలీష్ టేకింగ్ ఎలా ఉండ‌బోతోందో మ‌రోసారి వీడియోనే చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఈ సినిమా స్క్రిప్ట్ సుజీత్ కంప్లీట్ చేస్తున్నట్టుగా ఓ ఫుల్ పవర్ ప్యాక్డ్ వీడియో వ‌దిలారు. థ‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే వీడియోను నెక్ట్స్ లెవ‌ల్లో ఎలివేట్ చేసింది. ప‌వ‌న్ రోల్‌పై చూపించిన చిన్న చిన్న డీటెయిల్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. ఓవ‌రాల్‌గా ఓజీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమా నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news