Moviesచిరంజీవి పవన్‌తో పాటూ చరణ్‌తో కూడా రొమాన్స్ చేసిన ముగ్గురు హీరోయిన్లు...

చిరంజీవి పవన్‌తో పాటూ చరణ్‌తో కూడా రొమాన్స్ చేసిన ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ లు ఆఫ‌ర్ వ‌స్తే ఎవ‌రి ప‌క్క‌కు అయినా న‌టించ‌డానికి సిద్ద‌మ‌వుతుంటారు. సినిమా వేరు రియ‌ల్ లైఫ్ వేరు కాబట్టి ఆఫ‌ర్ లు వ‌స్తే తండ్రీ కొడుకుల‌తో రొమాన్స్ చేస్తూ ఉంటారు. అది అస‌లు త‌ప్పే కాదు ఒక రకంగా చెప్పాలంటే వృత్తి ధ‌ర్మం అనే చెప్పాలి. ఇక హీరోయిన్ లు త‌మ‌ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండి క‌థ పైన న‌మ్మ‌కం ఉంటే సై అంటారు. అలా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న స‌మ‌యంలో హీరోయిన్ తండ్రీ కొడుకుల ప‌క్క‌న కూడా న‌టించాల్సి ఉంటుంది.

కొడుకుకు జోడీ క‌ట్టిన త‌ర‌వాత కాస్త ఏజ్ పెరిగిందంటే చాలు తండ్రి ప‌క్క‌న న‌టించ‌డానికి కూడా రెడీ అయిపోతుంటారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవితో పాటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో రొమాన్స్ చేసిన ముగ్గురు హీరోయిన్ లు రామ్ చ‌ర‌ణ్ తో కూడా రొమాన్స్ చేశారు. ఆ ముగ్గురు ఎవ‌రు ఆ సినిమాలు ఏంటి అన్న వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. కాజ‌ల్ అగ‌ర్వాల్ రామ్ చ‌ర‌ణ్ తో మ‌గ‌ధీర సినిమాలో న‌టించింది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత గోవిందుడు అంద‌రివాడేలే సినిమాలోనూ రొమాన్స్ చేసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు చిరుకు జోడీగా కాజ‌ల్ ఖైధీ నెంబ‌ర్ 150 లో రొమాన్స్ చేసింది. ఆచార్య‌లోనూ ఆమె ముందు హీరోయిన్‌గా ఎంపికైంది. త‌ర్వాత ఆమెకు పెళ్ల‌య్యి ప్రెగ్నెంట్ కావడంతో ఆమె పాత్రను త‌ప్పించారు. ఇక మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కూడా ఒకే ఫ్యామిలీలో ముగ్గురితో రొమాన్ చేసింది. ఈ బ్యూటీ రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ర‌చ్చ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన కెమెరా మెన్ గంగ‌తో రాంబాబు సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా న‌టించింది. ఇక చిరంజీవి హీరోగా న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో ఆయ‌న‌కు జోడీ క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక త్వ‌ర‌లో రాబోతోన్న చిరు భోళా శంక‌ర్ సినిమాలోనూ త‌మ‌న్నాయే హీరోయిన్‌.

వీరితో పాటూ క‌మ‌ల్ ముద్దుల త‌న‌య శృతిహాస‌న్ కూడా ముగ్గురు హీరోల‌తో రొమాన్స్ చేసింది. శృతిహాస‌న్ రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ఎవ‌డు సినిమాలో న‌టించింది. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ తో రొమాన్స్ చేసింది. ఇక రీసెంట్ గా చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమాలో చిరుతో రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news