Moviesనయనతార లిస్ట్‌లో ఉండాల్సిన మహేష్ బాబు... జ‌స్ట్ ఎలా మిస్ అయ్యాడాంటే..?

నయనతార లిస్ట్‌లో ఉండాల్సిన మహేష్ బాబు… జ‌స్ట్ ఎలా మిస్ అయ్యాడాంటే..?

సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో న‌య‌న‌తార కూడా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ కూడా ఉంది. సాధార‌ణంగా ఒక ఇండ‌స్ట్రీలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటారు. కానీ అందాల న‌య‌న్ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండ‌స్ట్రీల‌లో కూడా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. న‌య‌న్ హీరోల‌తో రొమాన్స్ చేయ‌డ‌మే కాకుండా త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటే న‌ట‌న‌ను చింపేస్తుంది కూడా.

అందుకే ఈ బ్యూటీకి లేడీ ఓరియంటెడ్ సినిమాల‌లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇక న‌య‌న్ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అంద‌రి ప‌క్క‌నా జోడీ క‌ట్టింది. కోలీవుడ్ లోనూ ఈ అమ్మడు స్టార్ హీరోల‌తో జ‌తక‌ట్టింది. అయితే టాలీవుడ్ లో మ‌హేశ్ బాబు తో మాత్రం న‌య‌న్ రొమాన్స్ చేయ‌లేదు. అప్ప‌ట్లో న‌య‌న్ అందం చూసి మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ త‌మ హీరోతో కూడా ఒక సినిమా చేయాల‌ని అనుకునేవారు. కానీ ఆ కోరిక తీర‌నేలేదు. అయితే ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజం ఏంటంటే న‌య‌న్ లిస్ట్ లో మ‌హేశ్ బాబు కూడా ఉండాల్సిన వాడే.

కానీ ఏకంగా రెండు సార్లు మ‌హేశ్ బాబు ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. మ‌హేశ్ బాబు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పోకిరిలో ఇలియానా హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమాలో మొద‌ట న‌య‌న్ ను అనుకున్నారు. కానీ అమ్మ‌డు ఎక్కువ డిమాండ్ చేసేస‌రికి ఈ ఆఫ‌ర్ ఇలియానా వ‌ద్ద‌కు వెళ్లింది. ఇక ఇలియానా పోకిరి లో ఇర‌గ‌దీసిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా మ‌హేశ్ బాబు కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా దూకుడు.

ఈ సినిమాకు శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీను వైట్ల ఈ సినిమాలో న‌య‌న్ ను హీరోయిన్ గా తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. కానీ మ‌హేశ్ బాబు ఈ సినిమాలో న‌య‌న్ కంటే స‌మంత బాగుంటుంద‌ని చెప్పార‌ట‌. ఇక హీరో మాట‌ను కాదు అన‌లేక శ్రీనువైట్ల కూడా స‌మంత‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. స‌మంత దూకుడు సినిమాకు వంద‌శాతం న్యాయం చేసింది. అలా న‌య‌న్ లిస్ట్ లో ఉండాల్సిన మ‌హేశ్ మిస్ అయ్యాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news