Moviesత‌న మాట కాద‌న్న ఎన్టీఆర్‌కే షాక్ ఇచ్చిన ప‌ద్మ‌నాభం... ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

త‌న మాట కాద‌న్న ఎన్టీఆర్‌కే షాక్ ఇచ్చిన ప‌ద్మ‌నాభం… ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

అల‌నాటి కామెడీ ఆర్టిస్ట్‌, క్యారెక్ట‌ర్ న‌టుడు.. హీరో కూడా అయిన ప‌ద్మ‌నాభం గురించి నేటి త‌రానికి పెద్ద‌గా తెలియదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ప‌ద్మ‌నాభానికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే, దుర్భ‌ర పేద‌రికం నుంచి సినీరంగంలో అల‌నాటి మేటి న‌టి కన్నాంబ స‌హ‌కారంతో పుంజుకున్నాడు. ఇలా అడుగులు వేసిన ప‌ద్మ‌నాభం.. రూపాయి రూపాయి పోగుచేసి సినిమా నిర్మాత స్థాయికి ఎదిగారు.

 

1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు.

అయితే, మ‌ర్యాద రామ‌న్న చిత్రంలో అన్న‌గారు ఎన్టీఆర్‌ను హీరోగా తీసుకోవాల‌ని భావించారు. ఈ విష యంపై ఎన్టీఆర్‌తోనూ చ‌ర్చించారు. కానీ, అన్న‌గారు అప్ప‌టికే బిజీగా ఉండ‌డ‌మో.. లేక మ‌రో కార‌ణమో తెలియ‌దు కానీ.. సారీ చెప్పారు. ప‌ద్మ‌నాభం అంటే ప్రాణం పెట్టే ఎన్టీఆర్ ఇలా సారీ చెప్ప‌డంతో మ‌రో న‌టుడివైపు త‌ల‌తిప్పి చూడ‌డం ఆయ‌న‌కు ఇష్టంలేదు.

దీంతో ప‌ద్మ‌నాభం.. లాభ‌మో న‌ష్ట‌మో.. ఏదైనా కానీ అని ఆయ‌నే న‌టించారు. ఏకంగా ఈ సినిమా 100 రోజులుపైగా ఆడింది. శ‌త దినోత్స‌వ వేడుక‌లో అన్న‌గారు ప్ర‌త్యేకంగా హాజ‌రై.. ప‌ద్మ‌నాభం టాలెంటును మెచ్చుకోవ‌డం.. త‌న జీవితకాల పుర‌స్కారంగా అప్ప‌ట్లో ప‌ద్మ‌నాభం చెప్పుకొనేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news