Moviesబిగ్ బ్లాస్టింగ్ అప్ డేట్: బాలయ్య నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్...

బిగ్ బ్లాస్టింగ్ అప్ డేట్: బాలయ్య నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనే.. ఇండస్ట్రీ రికార్డులు బద్ధలవ్వాల్సిందే..!!

టాలీవుడ్ నందమూరి బాలయ్య లేటెస్ట్ గా హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి . డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ పాజీటివ్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య మరో మాస్ యాంగుల్ ని బయటపెట్టి నందమూరి అభిమానులకు ఆకలి తీర్చేశాడు . ఈ సినిమా పాజీటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది .

కాగా ప్రజెంట్ బాలకృష్ణ .. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక జవల్కర్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బాలకృష్ణకు కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది. కాగా ఈ సినిమా అయిపోయాక బాలకృష్ణ తన లక్కీ డైరెక్టర్ బోయపాటితో సినిమా తీయాలని అనుకున్నాడు .

కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కుర్ర డైరెక్టర్ కే ఓకే చెప్పి అభిమానులకు కొత్త బూస్టప్ ఇచ్చాడు . ప్రశాంత్ వర్మతో నందమూరి బాలయ్య సినిమా తీయడానికి డిసైడ్ అయ్యాడు . అంతేకాదు ఈ సినిమాని జాంబిరెడ్డి తరహాలో సరికొత్త కథనం తో తెరకెక్కించాలని.. డిసైడ్ అయ్యారట. ప్రశాంత వర్మ డైరెక్షన్లో బాలయ్య సినిమా అంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయితే అభిమానులకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news