Moviesతారక్ బర్త డే:రామ్ చరణ్ అలా ..బన్నీ ఇలా.. విషెస్ చెప్పడంలో...

తారక్ బర్త డే:రామ్ చరణ్ అలా ..బన్నీ ఇలా.. విషెస్ చెప్పడంలో ఇంత తేడానా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడం రాద్ధాంతం చేయడం .. ఈ మధ్యకాలంలో చాలా కామన్ గా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విషయంలో ఇవి ఎక్కువగా మనం గమనిస్తున్నాం. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా అల్లు అర్జున్ – రామ్ చరణ్ విష్ చేసిన పద్ధతి ఇప్పుడు నెట్టింట మరీ మరీ వైరల్ గా మారింది . ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి అదే విధంగా అల్లు ఫ్యామిలీకి పడడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇప్పుడు తాజాగా తారక్ ఆ చిక్కుల్లో ఇరుక్కునేశాడు . నేడు తారక్ పుట్టినరోజు . ఈ సందర్భంగా తారక్ ను ఇష్టపడే జనాలు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం “హ్యాపీ బర్త్డ డే మై డియరెస్ట్ ఫ్రెండ్ ” అంటూ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించిన ఒక పిక్ ని షేర్ చేస్తూ విషెస్ అందించాడు .

అంతవరకు బాగానే ఉంది . అయితే అల్లు అర్జున్ ఓ రేంజ్ లో బన్నీకి విష్ చేశాడు . మొదటి నుంచి అల్లు అర్జున్ – తారక్ బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అదే పిలుపుతో అల్లు అర్జున్ – తారక్ కి విష్ చేశాడు . దేవర నుంచి విడుదలైన ఫైర్ సాంగ్ పై కూడా అద్దిరిపోయే రేంజ్ లో కామెంట్ చేస్తూ ..”హ్యాపీ బర్త్డ డే బావ ..దేవర ఫియర్ సాంగ్ ఫైర్ లా ఉంది” అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది .

రామ్ చరణ్ కనీసం దేవరపై చిన్న ట్వీట్ కూడా చేయలేదు అని.. అదే అల్లు అర్జున్ దేవర పాట గురించి అద్దిరిపోయే రేంజ్ లో ఒక్క ముక్కలో కామెంట్ పెట్టాడు అని .. అల్లు అర్జున్ ని పొగిడేస్తూ రామ్ చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నట్లయింది చరణ్. చాలామంది రామ్ చరణ్ మొక్కుబడిగా విషెస్ చెప్పాడు అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news