Moviesఉన్న వాళ్ళే ఏం పీకలేకపోతున్నారు..ఈయన ఏం పీకుతాడట..?

ఉన్న వాళ్ళే ఏం పీకలేకపోతున్నారు..ఈయన ఏం పీకుతాడట..?

ఎస్ ప్రజెంట్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది డైరెక్టర్లు ఉన్నారు. ఎప్పుడు ఎవరొస్తున్నారో.. ఎప్పుడు ఎవరు పోతున్నారో.. తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న చూసిన డైరెక్టర్ రేపటి రోజున చూడలేకపోతున్నాం. ఏ డైరెక్టర్ హిట్టు కొడతాడో.. ఏ డైరెక్టర్ ఫ్లాప్ సినిమా ఇస్తారో అర్థం కాని పొజిషన్లో ఉంది సినిమా ఇండస్ట్రీ .

ఇలాంటి క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న వేణు ..డైరెక్టర్ గా మారిపోతున్నాడు అన్న న్యూస్ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది. వేణు డైరెక్ట్ చేస్తున్న చిత్రం పేరు బలగం. ఈ సినిమాని బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండడం విశేషం . స్టార్ కమెడియన్ గా ఉంటూనే హీరోగా అడపా దడపా సినిమాలు చేసిన వేణు ..తనదైన స్టైల్ లో కామెడీ చేసిన జనాలను మెప్పిస్తాడు.

కాగా ప్రియదర్శి హీరోగా ..అల్లు అర్జున్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన బేబీ కావ్య హీరోయిన్గా వేణు డైరెక్ట్ చేస్తున్న చిత్రమే ఈ బలగం . ఇప్పటికే దాదాపుగా 95 శాతం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది . కథ విన్న దిల్ రాజు మెస్మరైజ్ అయిపోయి ప్రొడ్యూసర్ గా ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధపడి నిర్మించాడట . అంతేకాదు ఈ సినిమాకి హ్యూజ్ రేంజ్ లోణే పబ్లిసిటీ కూడా చేయాలని డిసైడ్ అయ్యారట . ఒకవేళ నిజంగా సినిమా హిట్ కొడితే వేణు డైరెక్టర్గా చరుత్ర సృష్టించాడని చెప్పాలి. అయితే కొందరు మాత్రం వేణును వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . ఉన్న డైరెక్టర్స్ ఏం పీక్కోలేకపోతుంటే ..నువ్వు వచ్చి ఏం పీకుతావ్ అంటూ అసహ్యంగా మాట్లాడుతున్నారు. చూడాలి మరి వేణు అలాంటి వాళ్లకి తన సినిమాతో ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news