Moviesబెల్లం కాస్త అల్లం అయ్యిందే..హైపర్ ఆది కి బల్బ్ ఇప్పుడు వెలిగిందా..?

బెల్లం కాస్త అల్లం అయ్యిందే..హైపర్ ఆది కి బల్బ్ ఇప్పుడు వెలిగిందా..?

బుల్లితెరపై జబర్దద్ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈ షోకి వచ్చి పాపులారిటీ సంపాదించుకొని ..సినిమాలో నటించి ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు , బంగ్లాలు కొనుక్కున్న కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు . అంత ఎందుకు సుడిగాలి సుధీర్ ఇప్పుడు సోషల్ మీడియాని ,సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు . మొన్నటికి మొన్న ఆయన నటించిన గాలోడు సినిమా రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అన్న కామెంట్స్ వినిపించాయి.

అలాంటి ఓ స్టేటస్ సంపాదించుకున్న సుధీర్ ..వచ్చింది జబర్దస్త్ నుండే. కాగా అదే స్థాయిలో హైపర్ ఆది కూడా జబర్దస్త్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో పంచెస్ వేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్తూ ..ఫామ్ లోకి వచ్చిన హైపర్ ఆది ..జబర్ధస్త్ ని వీడిన్నత్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బుల్లితెర కమెడియన్స్ జబర్దస్త్ ని విడిన సంగతి తెలిసిందే .

హైపర్ ఆదికి రెమ్యూనరేషన్ విషయంలో జబర్దస్త్ టీం తో బెసికింది అని,, ఈ క్రమంలోనే హైపర్ ఆది పై ఘాటుగా కామెంట్స్ చేశారని …దీంతో హైపర్ ఆది జబర్దస్త్ నుండి తప్పకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇన్నాళ్లు జబర్దస్త్ పై కొందరు కమెడీయన్స్ మాట్లాడుతుంటే.. హైపర్ ఆదికి బుర్ర వెలగలేదా.. అతని వరకు వచ్చేసరికి ఆ ప్రాబ్లం అర్థమైందా..? అంటూ జనాలు ఆయనని ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఎందుకో ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కమెడియన్స్ ను ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఏది ఏమైనా సరే జబర్దస్త్ పై పాజిటివ్ కామెంట్స్ వచ్చిన నెగటివ్ కామెంట్స్ వచ్చిన టిఆర్పి లో మాత్రం నెంబర్ వన్ పొజిషన్లో ఉంది . చూడాలి మరి హైపర్ ఆది జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్లు అఫీషియల్ గా ప్రకటిస్తాడో.. కాంప్రమైజ్ అయి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news