Moviesకోరికలు తీర్చుకోవడానికే హీరోయిన్స్‌తో ముద్దు సీన్సా..?

కోరికలు తీర్చుకోవడానికే హీరోయిన్స్‌తో ముద్దు సీన్సా..?

కోరికలు తీర్చుకోవడానికే హీరోయిన్స్‌తో ముద్దు సీన్సా..? అనే వాదనలు ఇటీవల కొందరు విశ్లేషకులు ఆలోచింపజేస్తున్నారు. కొన్ని సినిమాలలోని సన్నివేశాలు..అందులో హీరోహీరోయిన్ అసందర్భంగా పెట్టుకునే ముద్దు సీన్స్ చూస్తే అదే సందేహం కలుగుతుంది. సినిమాలో ప్రతీ షాట్‌కి ఓ నిర్ధిష్ఠమైన లెక్క ఉంటుంది. ఈ సీన్స్ ఎందుకు చేశామూ.. ఓ నటుడు ఎందుకంత కష్టపడి సన్నివేశాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రేక్షకులను రంజింపచేయడానికి ఎందుకంత తాపత్రయపడుతున్నారు. అంటే అది రచయితలు.. ఎంతో ఆలోచించి రాయడం..దర్శకులు దాన్ని మలచ‌డానికి తీసుకునే శ్రద్ద.

నిర్మాత పెట్టే ఖర్చు .. ఇలా అన్నిటినీ దృష్ఠిలో పెట్టుకునే నటుడు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. హీరోయిన్స్ కూడా కథలో తన పాత్ర బలంగా ఉంటే ఎంతో శ్రమిస్తుంది. కామెడీ చేయాలన్నా.. ఎమోషనల్‌గా నటించాలన్నా.. నవరసాలలో ఏ ఒక్కటీ తగ్గకుండా ప్రతీ ఒక్కరు మేకప్ వేసుకున్న దగ్గర్నుంచీ కసితో నటిస్తారు. అయితే..బాలీవుడ్ సినిమాల ప్రభావం వల్ల మన సౌత్ సినిమాలలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలలో మసాలా సన్నివేశాలు మరీ మితిమీరిపోతున్నాయి.

ఇదొక పెద్ద కమర్షియల్ ఫార్ములా అయిపోయింది. కథ చెప్పడానికి నిర్మాత వద్దకి వెళితే ఆయన ముందుగానే సినిమాలో హీరోహీరోయిన్స్ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటారు అని అడగడం విడ్డూరంగా ఉంటోంది. కేవలం నిర్మాత మాత్రమే కాదు.. దర్శకుడు..హీరోహీరోయిన్స్ కూడా ఇదే అడుగుతున్నారు. ఒక హీరోయిన్ ఎక్కువ ముద్దులు పెట్టాలంటే రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. అదే ఆలోచించి కిస్ సీన్స్ గురించి ఆసక్తిగా అడుగుతున్నారు.

ఇక దర్శకులు కొందరైతే సీన్ స్వయంగా చేసి చూపించాలని చెప్పి హీరోయిన్‌ను ముద్దులాడుతున్నారు. ఇక హీరో గారైతే షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చినా ఇంకోసారి ముద్దు పెట్టుకోవచ్చు అనే కోరికతో ఇంకో టేక్ చేద్దాం అంటూ రెడీ అవుతున్నారు. హీరోయిన్స్ కూడా దీనికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఓ రకంగా ఎవరికి ఏది కావాలంటే అది వస్తుంది. అన్నీ కోరికలు తీరతాయి. అందుకే ఇప్పుడు ఏ సినిమాలో అయినా ముద్దు సన్నివేశం తప్పనిసరి అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news