Moviesఅందరి ముందే ప్రభాస్‌ని అన్నా అని పిలిచిన హీరోయిన్‌.. రచ్చ రచ్చ...

అందరి ముందే ప్రభాస్‌ని అన్నా అని పిలిచిన హీరోయిన్‌.. రచ్చ రచ్చ చేస్తున్న డార్లింగ్‌ ఫ్యాన్స్..!!

హ..హ..హ.. ఇది విన్న ఎవరికైనా సరే నవ్వు ఆగదు. ప్రభాస్ అభిమానులకి కడుపు మంట తప్పదు. అలా ఉంది. అఫ్ కోర్స్ ఎప్పుడూ బోరింగ్ న్యూస్ లేనా ..బాధపెట్టే న్యూస్ లేనా.. కాసేపు సరదాగా కూడా వినాలిగా.. చదవాలిగా.. అలాంటి ఓ న్యూస్ నే ఇది . ఎస్ రీసెంట్గా స్టార్ హీరోయిన్ అందరి ముందు స్టేజిపై ప్రభాస్ ని అన్నా అంటూ సంబోధించడం.. దీంతో ఒక్కసారిగా అక్కడ జనాలు రెండు నిమిషాల పాటు సైలెంట్ అయిపోయారు . ఏంటి ఈ అమ్మాయి ఇలా అంటుంది అంటూ షాక్ అయిపోయారు . పూర్తి వివరాలోకి వెళ్లితే..!!

జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫరీయా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్లో నటిస్తూ వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా జనాలను మెప్పిస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తుంచుకునేలా రోల్స్ చేస్తుంది. కాగా రీసెంట్గా నటించిన సినిమా ” లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ “.ఈ చిత్రంలో ఫీరియా అబ్ధులా, సంతోషం శోభన్ తో రొమాన్స్ చేసింది . నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా విడుదల కానుంది.

ఈ క్రమంలోనే శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిపించారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా యంగ్ హీరో నాని వచ్చారు . అయితే అంతా బాగానే ఉన్నా ఫరియా అబ్ధులా స్టేజ్ పై మాట్లాడుతూ..” జాతరత్నాలు సినిమా ట్రైలర్ ని ప్రభాస్ అన్న రిలీజ్ చేశాడు. సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రభాస్ అన్ని రిలీజ్ చేశాడు . ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని” చెప్పుకొచ్చింది . అంతే ఒక్కసారిగా ప్రభాస్ ని అన్నా అనడంతో షాక్ అయిపోయారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ని అన్నా అంటావా.. ఏంటిది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే అన్నా అని పిలవడం తప్పులేదు ..కదా అందరి హీరోయిన్స్ లా కాకుండా సరిగ్గా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది . ఇండస్ట్రీలో నెట్టుకొచ్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ చెప్పుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news