Moviesహెడ్ వెయిట్ తో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక..తిక్క...

హెడ్ వెయిట్ తో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక..తిక్క కుదిరిందిలే..!!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం కధ రాసుకునేటప్పుడు ..ఓ స్టార్ హీరోని గాని హీరోయిన్ గాని ఊహించుకుంటాం. ఆ హీరోయిన్ అయితే ఆ కథకు బాగా సూట్ అవుతుందని ఆశ పడతాం. కానీ ఆ హీరోయిన్ కి కథ చెప్పాక కదా నచ్చకపోవడం కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక కానీ ఆ సినిమాని హీరోయిన్స్ వదులుకుంటూ ఉంటారు . దీంతో ఆ కథ వేరే హీరో హీరోయిన్ల చేతికి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి .

అలా మంచి మంచి సినిమాలు వదులుకున్న మన తెలుగు స్టార్ హీరోయిన్లు బోలెడు మంది . అప్పటి హీరో నందమూరి తారక రామారావు దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన కిరణ్ అబ్బవరం వరకు అలా సినిమాలు వదులుకున్న హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది మల్టీ టాలెంటెడ్ రష్మిక మందన్నా.

రష్మిక మందన్నా క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో దూసుకుపోతుంది . అయితే రష్మిక మందన తన కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదులుకొనిందట. ఆ సినిమా మరేదో కాదు.. సామాన్యుల ప్రజల మనసు దోచుకున్న కలర్ ఫోటో.

ఎస్ సందీప్ రాజా డైరెక్టర్ చేసిన ఈ కలర్ ఫోటో సినిమా 2020లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది . ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సుహాస్ హీరోగా చేయడం చాందిని నటన అందర్నీ ఆకట్టుకునింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట రష్మిక మందన్నని అనుకున్నారట. అయితే ఆమె కంటెంట్ విని చిన్న సినిమా కావడంతో రెమ్యూనరేషన్ ఇవ్వలేరు చెప్పి రిజెక్ట్ చేసిందట. ఇక తర్వాత డైరెక్టర్ మనకి పెద్ద హీరోయిన్ వర్కౌట్ ఎవరు అంటూ చాందిని చౌదరిని అప్రోచ్ అయ్యి కథ చెప్పగానే ఓకే చేసి సినిమాను తెరకెక్కించడం ..రిలీజ్ చేయడం ,,సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం చకచగా జరిగిపోయాయి . ఏది ఏమైనా సరే రష్మిక హెడ్ వెయిట్ తో మంచి హిట్ మిస్ చేసుకున్నింది.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news