Movies"నా తల రాత అంతే..ఆ అదృష్టం లేదు "..సాయి పల్లవి కామెంట్స్...

“నా తల రాత అంతే..ఆ అదృష్టం లేదు “..సాయి పల్లవి కామెంట్స్ వైరల్..!!

సాయి పల్లవి ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ అందుకొని సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. చచ్చిన గ్లామరస్ రోల్ లో నటించను.. నాకు నచ్చిన సినిమాలే చేస్తాను.. ఎదుటివాడు ఎంత పెద్ద హీరో అయినా సరే ..నాకు కథలో కంటెంట్ లేకపోతే ఆ సినిమాకు సైన్ చేయను అంటూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే టైప్ ఈ హైబ్రీడ్ పిల్ల.

ఈ హెడ్ వెయిట్ సాయి పల్లవి అభిమానులకు తెగ నచ్చేసింది . కాగా సాయి పల్లవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. కొన్ని వదులుకునింది. కొన్ని తను తెలిసి వదులుకున్న మూమెంట్స్ అయితే.. కొన్ని తెలియక వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక అలాంటి వాటి గురించి రీసెంట్ గా ఆమె అటెండ్ అయిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది


సాయి పల్లవి మాట్లాడుతూ..” నేను చాలా సినిమాలు వదులుకున్నాను .కధ నచ్చక కొన్ని.. టైం సరిపోక మరికొన్ని.. వాటిల్లో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి . అయితే నేను ఏనాడు నేను వదిలేసిన సినిమాలు వేరే వాళ్ళకి వెళ్లి హిట్ కొట్టారు అని బాధపడను. పోనీలే వాళ్ళైనా హిట్ కొట్టారు కదా అని ఆనందపడతాను. నా క్యారెక్టర్ అలాంటిది . మరీ బాధ వేస్తే నాకు రాసిపెట్టి లేదు.. దేవుడు నా తలరాత ఇంతే రాసాడు. ఎవరేం చేస్తాం అనుకుని లైట్ గా తీసుకుంటాను . అంతే తప్పిస్తే ఆ సినిమాలో వదిలేసానని బోరున్న ఏడుస్తూ ఉన్న సినిమాలను వదులుకోను . నా మైండ్ సెట్ అంతే నాకు నచ్చింది చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.

 

దీంతో మరోసారి సాయి పల్లవి తానేంటో నిరూపించుకునింది. ఒకరి కోసం కాదు నాకోసం నేనే బ్రతుకుతాను అంటూ ప్రూవ్ చేసుకునేది సాయి పల్లవి అంటూ హాట్సాఫ్ చెబుతున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news