Moviesపూజా పనికిమాలిన పనితో..సాయి పల్లవి షాక్..!?

పూజా పనికిమాలిన పనితో..సాయి పల్లవి షాక్..!?

సినీ ఇండస్ట్రీలో రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు తమలోని టాలెంట్ ని.. ప్రతి పనిని గుర్తించి అవార్డులు ఇచ్చేవారు. కానీ రాను రాను ఆ సాంప్రదాయం డబ్బు ఎవరిస్తే వాళ్లకి అవార్డు అన్నట్టు తయారయింది. ఎస్ అవునండి ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతేకాదు సినీ వర్గాలలో కొత్త చర్చ మొదలైంది.

రీసెంట్ గా సైమా అవార్డ్స్ జరిగిన సంగతి తెలిసిందే. చాలా అట్టహాసంగా సైమా అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కి బిగ్ బిగ్ స్టార్స్ అందరూ అటెండ్ అయ్యారు . కాగా సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమా ప్రభంజనం సృష్టించింది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ నటుడు అంటూ బోలెడన్ని క్యాటగిరి లో అవార్డులు దక్కించుకున్నారు. కాగా ఇక్కడ బెస్ట్ హీరోయిన్ గా పూజకు అవార్డు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

నిజానికి పూజ బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకుంది ఏ సినిమాకో తెలుసా ..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకి. ఇది తెలుసుకున్న జనాలు నవ్వేస్తున్నారు. అసలు ఈ సినిమాలో పూజ నటన ఏమైనా ఉందా..? బాగుందా? కానీ అమ్మడికి ఎలా అవార్డు వచ్చింది. అదే మిగతా సినిమాలలో సాయి పల్లవిని కంపేర్ చేస్తే పూజ వేస్ట్ అని అంటున్నారు ఫాన్స్. లవ్ స్టోరీ శ్యాం సింగరాయ్ చిత్రాలకు సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్ గా నామినేట్ అయింది. నిజానికి లవ్ స్టోరీ శ్యామ్ సింగరాయ్ సినిమాలల్లో సాయి పల్లవి పాత్రకు మించి మోస్ట్ ఎలిజిబుల్ సినిమాలో పూజ హెగ్డే పాత్ర ఉందా? అంటూ మండిపడుతున్నారు. దీని కారణంగా నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. పూజా హెగ్డే డబ్బులు ఇచ్చే అవార్డు కొనుక్కుందంటూ మండిపడుతున్నారు . మరి చూడాలి దీనిపై పూజ ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news