Moviesవారెవ్వా: ఆ సినిమా కోసం బాలయ్యకు ఇష్టమైన హీరోయిన్.. బాక్స్ ఆఫిస్...

వారెవ్వా: ఆ సినిమా కోసం బాలయ్యకు ఇష్టమైన హీరోయిన్.. బాక్స్ ఆఫిస్ షేక్ అవ్వాల్సిందే..!!

ఎస్.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ వార్త నిజమనే తెలుస్తుంది . నందమూరి నటసింహం కోసం తన లక్కీ హీరోయిన్ ని ఫిక్స్ చేశాడట స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మనకు తెలిసిందే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలయ్య ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మరో మూడు నెలల్లో కంప్లీట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ అయిన మరోక్షణమే నందమూరి బాలయ్య స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో మరో సినిమాను మొదలుపెట్టనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా నటిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదానిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. గతంలో మీరాజాస్మిన్ ,ప్రియమణి పేర్లు వినిపించిన అవన్నీ ఒట్టి పుకార్లు అన్నట్లు తెలుస్తుంది.

కాగా రీసెంట్గా క్రేజీ అప్డేట్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అప్డేట్ విన్న ఎవరైనా సరే ఎగరిగంతేస్తారు. అంతా పూనకాలు తెప్పించే అప్డేట్ ఇది. ఈ సినిమాల్లో బాలయ్య కోసం నయనతారను ఫిక్స్ చేశాడట అనిల్ రావిపూడి. మనకు తెలిసిందే తెరపై బాలయ్య నయనతార జోడి ఎంత హిట్ కాంబినేషన్ ..వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గానే నిలిచింది. అంత చక్కగా అనిపిస్తుంది. కాగా NBK 108 సినిమా ఫుల్ యాక్షన్, మాస్, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నయనతార అలాంటి సూపర్ క్రేజీ హీరోయిన్ సినిమాలో బాలయ్య తో జత కడితే అది నిజంగా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి, ఈ క్రేజీ అప్డేట్ తో #NBK 108 టాప్ ట్రెండింగ్ లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news