Moviesఆ స్టార్ హీరో సినిమా నుండి తప్పుకున్న పూజా..షాకింగ్ రీజన్..?

ఆ స్టార్ హీరో సినిమా నుండి తప్పుకున్న పూజా..షాకింగ్ రీజన్..?

యస్..పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు బోలెడు బడా బడా ఆఫర్స్ వస్తున్నాయి. వాటిల్లో ఆమెకు నచ్చిన కధలకు సైన్ చేస్తూ..క్రేజీ గా పిచ్చెక్కిస్తుంది ఈ అమ్మడు. నిజానికి పూజా లాస్ట్ నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద దొబ్బేశాయి. భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, పూజా అందాలనే కావాలంటున్నారు జనాలు..దీంతో డైరెక్టర్, నిర్మాతలు కూడా ఆమెకు కోట్లు ఇచ్చి మరి కాల్ షీట్లు బుక్ చేయించుకుంటున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ఎఫ్3’లోనూ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఇక ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మనకు తెలిసిందే డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ తన లక్కి హీరో పవన్‌ కల్యాణ్‌తో భవదీయుడు భగత్‌ సింగ్‌ అనే ఓ క్లాసిక్ మూవీ చేయబోతున్నాడు. దీని పై అఫిషీయల్ ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతుంది. కానీ, ఆ తరువాత సినిమా పై ఎటువంటి న్యూస్ బయటకి రాలేదు. కాగా, అప్పట్లో ఈ మూవీలో పూజా హేగ్డే హీరోయిన్‌ అని ఓ హింట్‌ కూడా ఇచ్చాడు డైరెక్టర్. దీంతో ఫస్ట్ టైం పూజా పవన్ తో జోడి కడుతుందని తెలిసి ఫ్యాన్స్ అంతా హ్యాపీ గా ఫీల్ అయ్యారు. అందులోనూ డిజె రూపంలో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు, మొదటిసారి పవర్ స్టార్ కాంబినేషన్ కావడంతో పూజా కూడా ఉత్సాహంగానే ఉంది అన్న టాక్ బయటకు వచ్చింది.

 

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా నుండి పూజా పాప తప్పుకున్నట్లు తెలుస్తుంది. దానికి రీజన్ లేకపోనూలేదు. పవన్ ఓ పక్క సినిమాలతో, మరో పక్క రాజకీయాలతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాను ఎప్పుడు తెర పైకి తీసుకెళ్తారో కూడా తెలియడం లేదు. మరో పక్క, పూజా గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పూజా త్రివిక్రమ్ – మహేశ్ సినిమా, విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’, బాలీవుడ్‌ మూవీ యనిమల్‌లో స్పెషల్‌ సాంగ్స్‌కు ఒకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా మారిపోయిన పూజా..ఎప్పుడు మొదలవుతుందో తెలియని పవన్ సినిమా నుండి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే మేకర్స్ స్పందించాల్సిందే

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news