Moviesఆ హీరో ఫ్యాన్స్ ని సంతోషపరిచిన ర‌ణ‌బీర్..కాస్త ఓవర్ గా లేదు..?

ఆ హీరో ఫ్యాన్స్ ని సంతోషపరిచిన ర‌ణ‌బీర్..కాస్త ఓవర్ గా లేదు..?

ర‌ణ‌బీర్ కపూర్..బాలీవుడ్ బడా హీరో. చూడటానికి చాక్లెట్ బాయ్ లా చక్కగా ఉంటాడు. బాలీవుడ్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..నటన లో మార్కులు తక్కువైన పర్లేదు కానీ, లుక్స్ మాత్రం..100% రావాల్సిందే. ర‌ణ‌బీర్ కూడా అంతే..కానీ , ఈయన నటనలో కూడా కింగే. చూడటానికి సైలెంట్ గా కనిపిస్తాడు కానీ..వన్స్ షూటింగ్ సెట్స్ లోకి వచ్చి ..యాక్షన్ అంటే మాత్రం..విజృంభిస్తాడు. రీసెంట్ గా తన ప్రియ సుందరి..బాలీవుడ్ బడా బ్యూటీ అలియా భట్ ను పెళ్లి చేసుకుని..కొత్త జీవితం ప్రారంభించారు. పెళ్ళి తరువాత కూడా భార్య తో టైం గడపకుండా..సినిమాలు షూటింగ్ లు , ప్రమోషన్ లు అంటూ తిరుగుతున్నాడు కుర్రాడు.

అయితే, బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి, రణ్‌బీర్‌,దర్శకుడు అయాన్‌ ముఖర్జీ వైజాగ్‌లో సందడి చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చటించారు ర‌ణ‌బీర్. ఇక ఆ టైంలోనే మీడియా వాళ్ళు తనను ఇరుకున పెట్టే ప్రశ్నే వేసారు. “టాలీవుడ్ ఇండస్ట్రీలో ..మీకు బాగా నచ్చిన.. మీ ఫేవ‌రెట్ హీరో.. ఎవ‌రు?”అంటు అడిగేసారు ర‌ణ‌బీర్‌ ను.

అయితే, దీనికి ఏ మాత్రం తడబడకుండా..సమయం తీసుకోకుండా ..టక్కున ఆన్సర్ ఇస్తూ .. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌భాస్, ..ఇలా చాలా మంది స్టార్స్ నాకు ఇష్టమని చెప్పిన ఆయన.. ఎవ్వరినైన ఒక్కరినే చూస్ చేసుకోమంటే మాత్రం..ఖచ్చితంగా అది ప్రభాస్ అనే అంటాను ” అంటూ చెప్పుకొచ్చాడు ర‌ణ‌బీర్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నా..ఓ సో కాల్డ్ భజన బ్యాచ్…ఇండస్ట్రీలో మిగత ఫ్యాన్స్ ని రెచ్చ కొడుతుంది. అయ్యగారికి ఇండస్ట్రీ పై పట్టు లేన్నట్లు ఉంది.. కేవలం ..ప్రభాస్ క్రేజ్ వాడుకోవడానికే ఇలా చెప్పాడు..అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే, మెగాస్టార్ నటన ముందు..ప్రభాస్ నటన ఎంత..? నీకు అస్సలు టేస్ట్ లేదు అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news