Moviesఆ విషయంలో తండ్రిని మించిపోయిన సుకుమార్ కూతురు.. ఏం చేసిందో తెలుసా..?...

ఆ విషయంలో తండ్రిని మించిపోయిన సుకుమార్ కూతురు.. ఏం చేసిందో తెలుసా..? ఏకంగా అవార్డుని కూడా అందుకునిందిగా..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . ఆమె ఎనిమిదవ తరగతి చదువుతున్న విషయం చాలామందికి తెలుసు. ఆమె ఉత్తమ పరిచయ బాలనటిగా బెస్ట్ డెబ్యూ చైల్డ్ ఆర్టిస్ట్ దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం అందుకుంది . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ – తబితల ముద్దుల కూతురు సుకృతి వేణి పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

సుకుమార్ ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే . జనాల నాడిపట్టి సినిమాలను తెరకెక్కించే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు . త్వరలోనే పుష్ప2తో గ్లోబస్థాయిలో తన పేరు మారు మ్రోగిపోయేలా చేసుకోబోతున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే సుకుమార్ కూతురు సుకృతి వేణి తన సత్తాను చాటడం ఆయనకు మరింత కలిసి వచ్చింది .

గాంధీ తాత చెట్టు అనే చిత్రంలో ని నటనకు సుకృతి వేణి ఈ అవార్డ్ సొంతం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమా పలు అంతర్జాతీయ సినీ వేదికలపై మెరిసింది . త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ గోపి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి . చాలా చిన్న ఏజ్ లోను సుకృతి వేణి తన సత్తా చాటడంతో.. జనాలు ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు. సుకుమార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తూ తండ్రికి తగ్గ తనయ అంటూ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు..!

‘గాంధీ తాత చెట్టు’ సాధించిన మరికొన్ని అవార్డులివీ.. ‘దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌,’ ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డులూ సుకృతికి వరించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news